Advertisement
Google Ads BL

రణబీర్ అక్కడ అలియా ఇక్కడ


ఐదేళ్లు ప్రేమ పక్షులుగా తిరిగి.. ప్రేమని ఎంజాయ్ చేసిన అలియా భట్ - రణబీర్ కపూర్ లు ఏప్రిల్ 14 న ముంబైలోని వాస్తు అపార్ట్మెంట్ లో వివాహం చేసుకున్నారు. తర్వాత రెండు రోజులకే ముంబై లోని తాజ్ హోటల్ లో బాలీవుడ్ సెలబ్రిటీస్ కి రిసెప్షన్ తో గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఇక పెళ్లైన రెండు మూడు రోజుల పాటు అలియా భట్ - రణబీర్ కపూర్ ల పెళ్ళికి వచ్చిన గిఫ్ట్ ల గురించి అలాగే, వాళ్ళ పెళ్లి ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. మూడు రోజుల తర్వాత ఈ జంట హనీమూన్ ప్లాన్స్ లో ఉంటుంది.. విదేశాలకు ఎగిరిపోతుంది అనుకున్న వాళ్ళకి షాక్ ఇస్తూ రణబీర్ కపూర్ తన షూటింగ్స్ లో బిజీ అవ్వగా.. అలియా భట్ కూడా నాలుగో రోజే ఇల్లు దాటి పనిలో పడిపోయింది. పెళ్లి తర్వాత అలియా భట్ మంగళ సూత్రం వేసుకోలేదు, నుదుటిన కుంకుమ పెట్టుకోలేదు.. అలియా ఆచారాలను పట్టించుకోవడం లేదు అంటూ నెటిజెన్స్ ని ట్రోల్ కూడా చేసారు.

Advertisement
CJ Advs

ఇక ఇప్పుడు రణబీర్ ఓ చోట, అలియా భట్ ఓ చోట అన్నట్టుగా ఉంది ఈ కొత్త జంట వ్యవహారం. అంటే రణబీర్ కపూర్ హీరో గా సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్న యానిమల్ షూటింగ్ ఈ రోజే హిమాలయాల్లో ప్రారంభమైంది. ఈ సినిమాలో హీరో కేరెక్టర్ ని బట్టి ఆ సినిమాకి ఆ టైటిల్ పెట్టారు మేకర్స్. మరి హిమాలయాల్లో రణబీర్ ఉంటే.. అలియా భట్ మాత్రం ముంబైలోనే రాకీ ఆర్ రాణి కి ప్రేమ్ కహాని సెట్స్ లో షూటింగ్ లో బిజీ అయ్యింది. రణ్వీర్ సింగ్ తో అలియాభట్ నటిస్తున్న రాకీ ఆర్ రాణి కి ప్రేమ్ కహాని చిత్రానికి కరణ్ జోహార్ దర్శకుడు. ప్రస్తుతం సెట్ నుండి అలియా భట్ ఫొటోస్ బయటికి రాగా.. అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సో పెళ్లి తర్వాత వారం తిరక్కముందే అలియా అలా, రణబీర్ ఇలా షూటింగ్స్ తో బిజీ బిజీగా మారిపోయారు.

Days after wedding with Alia Bhatt, Ranbir Kapoor begins work:

Newlywed Ranbir Kapoor and Alia Bhatt Resumes Work Just 3 Days After.. wedding
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs