Advertisement
Google Ads BL

ఆచార్య తో పోటీ అవసరమా..


హీరో శ్రీ విష్ణు ఈమధ్యన సక్సెస్ కోసం తపన పడుతున్నాడు. రాజ రాజా చోర తర్వాత మళ్ళీ హిట్ కొట్టని శ్రీ విష్ణు ఈసారి భళా తందనాన అంటూ ఇంట్రెస్టింగ్ టైటిల్ తో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అయ్యి డేట్ లాక్ చేసారు మేకర్స్. కానీ భళా తందనాన డేట్ చూసిన వారంతా మెగాస్టార్ చిరు ఆచార్య తో పోటీ అవసరమా అంటూ షాకవుతున్నారు. ఎందుకంటే ఏప్రిల్ 29 న మెగాస్టార్ - రామ్ చరణ్ - కొరటాల కలయికలో తెరకెక్కిన భారీ చిత్రం ఆచార్య రిలీజ్ అవుతుంది.

Advertisement
CJ Advs

ఆ తర్వాతి రోజే అంటే ఏప్రిల్ 30 నే భళా తందనాన రిలీజ్ డేట్ ప్రకటించారు. చైతన్య దంతులూరి దర్శకత్వంలో తెరేకిన ఈసినిమాలో శ్రీ విష్ణు సరసన కేథ‌రిన్ థ్రెసా నటిస్తుంది. అయితే ఆచార్యకి పోటీ అంటుంటే.. సమ్మర్ హాలీ డేస్ ఉన్నాయి కదా, మే 3న రంజాన్ పండగ కూడా సినిమాకు మరో అడ్వాంటేజ్ కదా అని రిలీజ్ డేట్ ఇచ్చామంటున్నారు మేకర్స్. మరి సినిమాకి హిట్ టాక్ వస్తే ఓకె.. లేదంటే ఆచార్య సునామీలో కొట్టుకుపోవడం మాత్రం ఖాయం.

Bhala Thandanana Releasing On April 30th:

Sree Vishnu, Catherine Tresa, Chaitanya Dantuluri, Vaaraahi Chalana Chitram Bhala Thandanana Releasing On April 30th
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs