ఈ రోజు మహేష్ బాబు, ఆయన నటిస్తున్న సర్కారు వారి పాట సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నారు. కారణం మహేష్ బాబు తన తల్లి ఇందిరాదేవి గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడం ఒకటైతే, సర్కారు వారి పాట నుండి 3rd సింగిల్ అప్ డేట్ ఇవ్వబోతున్నట్టుగా మేకర్స్ చెప్పడం మరొకటి. ఇక ఇందిరా గారి పుట్టిన రోజుకి మహేష్ బాబు స్పెషల్ గా విష్ చెయ్యడమే కాదు, ఆయన భార్య నమ్రత అయితే గౌతమ్, సితారలు తమ నాన్నమ్మతో కలిసి దిగిన పిక్ ని షేర్ చేసింది. అదలా ఉంటే మహేష్ తల్లి ఇందిరా దేవి పుట్టిన రోజు వేడుకలని సూపర్ స్టార్ కృష్ణ ఇంట్లో ఘనంగా జరిగాయి.
ఇందిరా గారు బర్త్ డే కేక్ కట్ చేసారు. నమ్రత, గౌతమ్, సితార అలాగే మంజుల, గల్లా జయదేవ్, హీరో గల్లా అశోక్, ఇంకా గల్లా జయదేవ్ భార్య, సుధీర్ బాబు వైఫ్ ప్రియా కూడా ఉన్నారు. అలా సూపర్ స్టార్ కృష్ణ - ఇందిరా గార్ల సంతానమైన ముగ్గురు కూతుళ్లు తల్లి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనగా మహేష్ మాత్రం మిస్ అయ్యాడు. కృష్ణ గారు భార్య ఇందిరా గారికి కేక్ తినిపించి, గ్రూప్ ఫోటో దిగారు. ఆ పిక్ లో మహేష్ మిస్ అవడంతో ఆయన ఫాన్స్ కాస్త డిస్పాయింట్ అయ్యారు. మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సాంగ్ షూట్ కోసం రామోజీ ఫిలిం సిటీలో ఉండిపోవడంతో ఆయన ఈ వేడుకలని మిస్ అయినట్లుగా తెలుస్తుంది.