హీరోయిన్ కాజల్ అగర్వాల్ నిన్న మంగళ వారం అంటే ఏప్రిల్ 19 న పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. 2020 లో తన బాయ్ ఫ్రెండ్ గౌతమ్ కిచ్లు ని వివాహం చేసుకున్న కాజల్ అగర్వాల్.. తర్వాత కూడా సినిమాల్లో నటించింది. అయితే త్వరగా సినిమా షూటింగ్స్ కంప్లీట్ చేసుకుని.. కొన్ని మధ్యలోనే వదిలేసిన కాజల్.. పిల్లలు ప్లాన్ చేసుకుంది. ప్రెగ్నెంట్ అయిన కాజల్ కొద్దిరోజులు బయట కనిపించలేదు. తర్వాత బేబీ బంప్ తో చాలారకాల ఫోటో షూట్స్ చేసింది.
ఇక నిన్న తల్లి అయిన కాజల్ కి పండంటి కొడుకు పుట్టిన విషయాన్ని ఆమె చెల్లెలు నిషా అగర్వాల్ సోషల్ మీడియా ద్వారా అందరికి తెలియజేసింది. కాజల్ కి పండంటి బిడ్డ జన్మించడంతో కాజల్, గౌతమ్ కిచ్లు ఫామిలీస్ ఆనందంలో మునిగితేలుతున్నాయి. ఇక తన అక్క కాజల్ కొడుకు పేరు నీల్ కిచ్లూ అని పెడుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది నిషా అగర్వాల్. దానితో కాజల్ ఫాన్స్ మాత్రమే కాకుండా నెటిజెన్స్ నీల్ కిచ్లూ వెల్‌కమ్ టు ది న్యూ వరల్డ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.