ఈమధ్యన కొంతమంది పనిగట్టుకుని సర్కారు వారి పాట మే 12 న విడుదల అసాధ్యం నిన్నమొన్నటివరకు షూటింగ్ కంప్లీట్ కాలేదు, ఎప్పటిలాగే ఈ సినిమా మరో డేట్ కి మారొచ్చనే న్యూస్ లు స్ప్రెడ్ చెయ్యడంతో మహేష్ ఫాన్స్ కంగారు పడిపోయారు. అసలే పాండమిక్ సిట్యువేషన్ తో గత రెండున్నరేళ్లుగా మహేష్ ని సిల్వర్ స్క్రీన్ మీద చూడలేదు. అందుకే మహేష్ ఫాన్స్ బెంగ పడిపోయారు. ఇక సోషల్ మీడియాలో మేకర్స్ పై మహేష్ ఫాన్స్ ఆగ్రహం కూడా వ్యక్తం చేసారు. ప్రస్తుతం మహేష్ బాబుతో మాసివ్ సాంగ్ చిత్రీకణలో దర్శకుడు పరశురామ్ బిజీగా ఉండడమే కాదు.. రామోజీ ఫిలిం సిటీలో వేసిన ఓ మాసివ్ సెట్ లో సర్కారు వారి పాట మాస్ సాంగ్ చిత్రీకరణ జరుగుతున్నట్టుగా అప్ డేట్ ఇచ్చారు.
ఇక తాజాగా సర్కారు వారి పాట మేకర్స్ అంటే సుందరానికి టీజర్ లాంచ్ ఈవెంట్ లో జూన్ పది న అంటే సుందరానికి వస్తుంది అని, మధ్యలో అంటే మే 12 న సర్కారు వారి పాట తో కొడుతున్నాం అంటూ అధికారికంగా ప్రకటించడంతో మహేష్ ఫాన్స్ ఖుషీగా ఫీలవుతున్నారు. సర్కారు వారి పాట రిలీజ్ డేట్ పై వస్తున్న రూమర్స్ అన్నిటికి అలా మేకర్స్ చెక్ పెట్టెయ్యడంతో.. అనుకున్న డేట్ కి సినిమా వస్తుంది ఇది ఫిక్స్ అంటూ పండగ చేసుకుంటున్నారు ఫాన్స్.