ఈ రోజు సూపర్ స్టార్ కృష్ణ భార్య, మహేష్ బాబు తల్లి ఇందిరా గారి పుట్టిన రోజు. తన తల్లికి మహేష్ బాబు లవ్లీ బర్త్ డే విషెస్ తెలియజెయ్యడమే కాదు.. ఆమె పుట్టిన రోజునాడు మహేష్ ఫాన్స్ కి ఆయన ఓ స్వీట్ గిఫ్ట్ రెడీ చేసారు. అది సర్కారు వారి పాట నుండి థర్డ్ సింగిల్ అప్ డేట్ ఈ రోజు Dropping Cracker of a THIRD SINGLE UPDATE today evening 🥁 అంటూ మేకర్స్ అధికారికంగా తెలియజేసారు. నిన్నటివరకు WorestTeamSVP అంటూ మహేష్ ఫాన్స్ సోషల్ మీడియాలో హడావిడి చెయ్యగానే.. మహేష్ - పరశురామ్ లు సర్కారు వారి పాట మాసివ్ సాంగ్ అప్ డేట్స్ ఇస్తూ వస్తున్నారు.
ఇక ఈ రోజు ఇందిరా గారి పుట్టిన రోజు స్పెషల్ గా సాయంత్రం థర్డ్ సింగల్ అప్ డేట్ కూడా రాబోతుంది. దానితో మహేష్ బాబు ఫాన్స్ కూల్ అవడమే కాదు, హ్యాపీ గా సర్కారు వారి పాటని ఇండియా లెవల్లో ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పటికే కళావతి, పెన్నీ సాంగ్స్ అంచనాలకు మించి హిట్ అవడంతో థమన్ మ్యూజిక్ లో రాబోతున్న ఈ మూడో సింగిల్ పై కూడా అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాలో మహేష్ కీర్తి సురేష్ తో రొమాన్స్ చేస్తున్నాడు. అలాగే హ్యాండ్ సం గా మహేష్ లుక్స్ అందరికి తెగ నచ్చేసాయి కూడా.