Advertisement
Google Ads BL

బిగ్ బాస్: బాబా ని చూసి భయపడ్డారు


బిగ్ బాస్ నాన్ స్టాప్ లోకి ఫస్ట్ వైల్డ్ కార్డు ఎంట్రీగా బాబా భాస్కర్ అడుగుపెట్టాడు. సీజన్ 3 లో బెస్ట్ ఎంటెర్టైనెర్ గా నిలిచిన బాబా భాస్కర్ ని మళ్ళీ భారీ పారితోషకంతో హౌస్ లోకి ఎంట్రీ ఇప్పించారు. హౌస్ మేట్స్ గొడవలు తప్ప అక్కడ ఎంటర్టైన్మెంట్ మిస్ అవడంతో బాబా భాస్కర్ ని మధ్యలో బిగ్ బాస్ హౌస్ లోకి పంపించారు. అయితే బాబాని ఆదివారమే హౌస్ లోకి పంపినా.. సీక్రెట్ రూమ్ లో పెట్టి హౌస్ మేట్స్ ఆట తీరుని గమనించమని చెప్పి నామినేషన్స్ లోకి వచ్చిన ఆరుగురిలో ఒకరిని సేవ్ చెయ్యమనగానే.. బాబా భాస్కర్ బిందు మాధవిని సేవ్ చేసాడు. తర్వాత హౌస్ లోకి అపరిచితుడు అంటే గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చి హౌస్ మేట్స్ తో ఆటలాడించాడు. ఆ తర్వాత బాబా భాస్కర్ తనదైన స్టయిల్లో హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో హౌస్ మేట్స్ ఒక్కసారిగా షాకయ్యారు. 

Advertisement
CJ Advs

ఈయనేమిట్రా బాబు బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చేసాడని భయపడ్డారు కూడా. ఆ తర్వాత బాబా భాస్కర్ అందరినీ లోపలికి పిలిచి.. నామినేట్ అవని వాళ్లంతా.. నామినేషన్స్‌లో ఉన్న ఆరుగురిలో ఒకరిని సెలెక్ట్ చేయమని చెప్పాడు. దీంతో ఆరియానా ఆయనతో గొడవకు దిగింది. ఇక నామినేట్ అవని వాళ్ళు అనిల్ పేరు చెప్పగా.. చివరికి బాబా బిందు, అజయ్ లు ఆట తీరు బావుంది అంటూ బిందు ని నామినేషన్స్ నుండి సేవ్ చెయ్యడంతో అఖిల్ అండ్ బ్యాచ్ కి షాక్ తగిలింది. అంటే బిందు మాధవి బయట స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ప్రాజెక్ట్ అయ్యి ఉంటుంది అందుకే బాబా భాస్కర్ ఆమెని సేవ్ చేసాడని వాళ్లలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు.

Bigg Boss Non Stop: Wild card contestant Baba Bhaskar:

Bigg Boss Telugu OTT: Ariyana Glory loses her cool
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs