ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కలయికలో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న సలార్ మూవీ గత వారం రోజులుగా సోషల్ మీడియాలో హడావిడి చేస్తుంది. కేజిఎఫ్ ప్రమోషన్స్ లో ప్రశాంత్ నీల్ సలార్ అప్ డేట్స్ ఇస్తూ వచ్చేసరికి ప్రభాస్ ఫాన్స్ సలార్ ని ట్రెండ్ చేస్తున్నారు. ప్రభాస్ కటౌట్ కి సరిపోయే మాస్ కేరెక్టర్ ని ప్రశాంత్ నీల్ డిజైన్ చేసారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, అలాగే లీకెడ్ పిక్ లో ప్రభాస్ నిచూసుకుని ఫాన్స్ హ్యాపీ గా ఉన్నారు. రాధే శ్యామ్ లో ప్రభాస్ లుక్ పై తీవ్రమైన విమర్శలు రావడంతో కాస్త డిస్పాయింట్ అయిన ప్రభాస్ ఫాన్స్ సలార్ లో ఆయన లుక్ చూసి కూల్ అయ్యారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ చాలా క్రూరంగా కనిపిస్తారని ప్రశాంత్ నీల్ చెప్పడంతో సలార్ పై అంచనాలు పెరిగిపోతున్నాయి.
ఇక మే ఫస్ట్ వీక్ నుండి సలార్ షూట్ రెస్యూమ్ అంటూ చెబుతుంటే.. ఇప్పుడు వచ్చే వారం సలార్ నుండి మచ్ అవైటెడ్ అప్ డేట్ రాబోతుంది అంటున్నారు. Much awaited update about THE MOST VIOLENT MAN #Salaar 💥స్టే ట్యూన్డ్ అంటూ అప్ డేట్ ని చూసిన ప్రభాస్ ఫాన్స్.. సలార్ నుండి ఎలాంటి అప్ డేట్ రాబోతుందో అనే క్యూరియాసిటీలోకి వెళుతున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కటౌట్ కి సరిపోయే హీరోయిన్ శృతి హాసన్ నటిస్తుండగా.. మలయాళ టాప్ హీరో పృద్వి రాజ్ సుకుమారన్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. దానితో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఇక సలార్ టీజర్ మే ఎండింగ్ లో ఉండబోతున్నట్లుగా ప్రశాంత్ నీల్ ప్రభాస్ ఫాన్స్ కి ఎప్పుడో గుడ్ న్యూస్ చెప్పారు.