ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ 2 రిలీజ్ అయ్యింది.. ఆ సినిమా రికార్డుల వేటలో ఉంది.. కెజిఎఫ్ కి సీక్వెల్ గా వచ్చిన చాప్టర్ 2 బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో కన్నడ ఆడియన్స్ తో పాటుగా యశ్ ఫాన్స్ ఆనందంగా ఉన్నారు. ఇక కెజిఎఫ్ చాప్టర్ 2 ముచ్చట ముగియడంతో.. ప్రశాంత్ నీల్ తన నెక్స్ట్ మూవీ ప్రభాస్ సలార్ పై దృష్టి పెట్టబోతున్నారు. మే ఫస్ట్ వీక్ నుండి సలార్ షూట్ రెస్యూమ్స్ అంటూ అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అయితే సలార్ మూవీ రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుని మూడో షెడ్యూల్ కోసం రెడీ అవుతుంది. ఈ లోపులో సలార్ సెట్స్ నుండి ప్రభాస్ పిక్స్ లీకై సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
సలార్ లీక్డ్ పిక్స్ యాక్షన్ సీక్వెన్స్ కి సంబందించినవి. ఆ పిక్స్ ఒక దానిలో ప్రభాస్ యాక్షన్ సీక్వెన్స్ కోసం సిద్ధంగా ఉన్నాడు. మరొకదానిలో ప్రభాస్ తన చుట్టూ ఉన్న కొంతమంది స్పాట్ బాయ్స్‌తో నార్మల్ లుక్ లో నడుస్తూ కనిపిస్తున్నాడు. ప్రెజెంట్ ఈ పిక్స్ ని ప్రభాస్ ఫాన్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేస్తుండడంతో సలార్ హాష్ టాగ్, అలాగే ప్రభాస్ హాష్ టాగ్స్ ట్విట్టర్ లో నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా శృతి హాసన్ నటిస్తుండగా.. ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ కి ముందు సముద్రంపై జరిగే ఛేజింగ్ సీక్వెన్స్ సినిమాకు హైలెట్‌గా ఉంటుంది అని, సముద్రం లోపల జరిగే ఫైట్ ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయని టాక్.