Advertisement
Google Ads BL

నారాయణ్ దాస్ మృతిపై సెలబ్రిటీస్ స్పందన


ప్ర‌ముఖ నిర్మాత‌ నారాయ‌ణ దాస్ నారంగ్ (76) ఈ రోజు ఉదయం హఠాన్మరణం అందరిని షాక్ కి గురి చేసింది. కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయ‌న స్టార్ ఆసుప్ర‌తిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉద‌యం తుదిశ్వాస విడిచారు. నారాయణ దాస్ మరణం పట్ల సినీ ప్రముఖులు దిగ్బ్రాంతికి గురయ్యాయు. ఆయన మరణం పట్ల సెలబ్రిటీస్ తమ స్పందనని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు.

Advertisement
CJ Advs

చియాంజీవి:

ప్రదర్శనారంగంలో నిష్ణాతుడు, మాట మీద నిలబడే నిఖార్సైన మనిషి,నిబద్ధత కలిగిన వ్యక్తి,అపార అనుభవజ్ఞుడు,సినీరంగంలో ఒక మహారథి, ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ అధ్యక్షులు శ్రీ నారాయణదాస్ నారంగ్ గారికి శ్రద్ధాంజలి🙏🙏🙏

మహేష్ బాబు:

నారాయణదాస్ నారంగ్ గారి మరణం దిగ్భ్రాంతికి గురి చేసింది. మరియు విచారకరం. మన చిత్ర పరిశ్రమలో ఒక గొప్ప వ్యక్తి.. ఆయన లేకపోవడం బాధాకరం. 

వివి వినాయక్:

డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, నిర్మాతగా సినీ పరిశ్రమలో ప్రతి ఒక్కరి తో స్నేహ పూర్వకంగా మెలిగే వ్యక్తి. అలాగే వారి కుమారుడు సునీల్ సక్సెస్ ఫుల్ పంపిణీ దారుడు. రీసెంట్ గా వరుసగా సినిమాలు నిర్మిస్తూ వున్నారు. అలాంటి టైంలో నారాయణ్ దాస్ గారు లేకపోవడం పరిశ్రమకి ఎంతో తీరని లోటు. వారి ఆత్మకు శాంతి కలగాలి.. 

నల్లమలుపు బుజ్జి:

నారాయణ్ దాస్ గారితో, వారి కుమారుడు సునీల్ తో నాకు మంచి అనుబంధం ఉంది.. నారాయణ్ దాస్ గారు సడన్ గా ఇలా పోయారన్న వార్త వినగానే చాలా బాదేసింది. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.. 

వల్లభనేని వంశీ:

ఏషియన్ గ్రూప్స్ అధినేత ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ నారాయణ్ కె.దాస్ నారంగ్ గారి మృతి చెందారన్న విషయం నన్ను వ్యక్తిగతంగా బాధించింది. నైజాం డిస్ట్రిబ్యూటర్ గా ఆయన ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. అలాంటి వ్యక్తి  దూరమవడం చాలా దురదృష్టం.. వారి కుటుంబ సభ్యులకు నా సంతాపాన్ని తెలుపుతూ.. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.. 

కొడాలి నాని:

తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షులు నారాయణ్ కె. దాస్ నారంగ్ గారు సినీ ఇండస్ట్రీలో అజాత శత్రువు గా పేరొందారు . నైజాం లో ఎగ్జిబిటర్ మరియు పంపిణీదారులుగా విశేష సేవలందించారు. వారి మరణం విచారకరం. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.. 

Celebrities reaction to the death of Narayan Das:

Narayan Das Narang Passed away
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs