Advertisement
Google Ads BL

బిగ్ బాస్: ఈవారం నామినేషన్స్ లిస్ట్


బిగ్ బాస్ నాన్ స్టాప్ హాట్ స్టార్ లో అలా అలా నడుస్తుంది. బిగ్ బాస్ సీజన్స్ అంత క్రేజ్ లేకపోయినా కంటెస్టెంట్ ఎలాగో తంటాలు పడి మరీ కంటెంట్ పుట్టిస్తున్నారు. ఇక గత ఏడు వారాలుగా ఆరుగురు ఎలిమినేట్ అయ్యి హౌస్ ని వీడగా బాబా భాస్కర్ వైల్డ్ కార్డు ఎంట్రీతో హౌస్ లోకి అడుగుపెట్టాడు. కానీ బాబా భాస్కర్ రావడమే ఓ కంటెస్టెంస్ట్ కి మంచి చేసాడు. ఇక ఈ వారం నామినేషన్స్ లో అజయ్ ముందుగా అనిల్, హమీదలను టాస్క్ లో బిహేవియర్ బాగోలేదని చెబుతూ నామినేట్ చేశాడు. ఆ తర్వాత అరియనా అషురెడ్డి, అఖిల్ లను నామినేట్ చేసింది. దానితో అఖిల్, ఆశు రెడ్డి లు అరియనతో గొడవ పడ్డారు. ఇంకా ఆశు రెడ్డి అరియనా నువ్వు గేమ్ ఆడడానికి రాలేదు.. వెకేషన్ లా ఎంజాయ్ చెయ్యడానికి వచ్చావ్ అంటూ నామినేట్ చేసింది.

Advertisement
CJ Advs

తర్వాత హమీద ఆశుని అజయ్ ని నామినేట్ చెయ్యగా ఆశు రెడ్డి హమీద నీ మెంటల్ స్టేటస్ బాగానే ఉందా అని అడగడంతో పెద్ద రచ్చ అయ్యింది. తర్వాత అనిల్ వంతు రావడంతో నటరాజ్ మాస్టర్, అజయ్ లను నామినేట్ చేశాడు. అఖిల్ తనని నామినేట్ చేసిన అరియానాతో పాటుగా ఎప్పటిలాగే తనకి కాంపిటీటర్ అయిన బిందుని అఖిల్ నామినేట్ చేశాడు. ఆ దెబ్బకి అఖిల్ కి బిందు మాధవికి మధ్య వాదన గట్టిగా జరిగింది . నటరాజ్ మాస్టర్ అనిల్, హమీదలను నామినేట్ చేయగా హమీద, నటరాజ్ కి మధ్యన గొడవైంది. బిందు మాధవి.. అఖిల్, అజయ్ లని నామినేట్ చేసింది. బిందు మాధవి - శివ ఫ్రెండ్స్ గా ఉండేవారు కాస్తా ఈ నామినేషన్స్ వల్ల బేధాప్రియాలు మొదలయ్యాయి. అయితే బిగ్ బాస్ బాబా భాస్కర్ కి ఇచ్చిన స్పెషల్ పవర్ వలన బాబా బిందు మాధవిని నామినేషన్స్ లో లేకుండా సేవ్ చేసాడు. ఇక ఈ వారం అఖిల్, అషురెడ్డి, అనిల్, హమీద, అజయ్ లు నామినేషన్స్ లోకి వచ్చారు.

Bigg Boss Non Stop: This Week Nominations List:

Bigg Boss Non Stop: This Week Nominations episode
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs