Advertisement
Google Ads BL

ఫస్ట్ వీకెండ్ లోనే అఫీషియల్ గా 546 కోట్లు


కన్నడలో తెరకెక్కి పాన్ ఇండియా మార్కెట్ లో అదిరిపోయే కలెక్షన్స్ కొల్లగొడుతున్న కెజిఎఫ్ చాప్టర్ 1 కి సీక్వెల్ గా వచ్చిన కెజిఎఫ్ చాప్టర్ 2 విడుదలైన అన్ని భాషల్లో విజయ ఢంకా మోగిస్తుంది. రాఖి భాయ్ గా యశ్, దర్శకుడు ప్రశాంత్ నీల్ మేకింగ్ కి బిసి సెంటర్స్ ఆడియన్స్ కెజిఎఫ్ చాప్టర్ 2 కి బ్రహ్మరథం పడుతున్నారు. కెజిఎఫ్ 2 పై ఎన్ని అంచనాలైతే పెట్టుకున్నారో.. ఆ అంచనాలను ఈజీగా రీచ్ అయ్యేలా కనబడుతుంది ఈ సినిమా. హిందీ, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలువడమే కాకుండా ఆల్‌టైమ్ ఓపెనింగ్స్ సాధించింది.

Advertisement
CJ Advs

కేవలం నాలుగు రోజుల్లోనే 500 కోట్ల క్లబ్బులోకి చేరిపోయింది. కన్నడ లో నాలుగు రోజుల్లోనే 500 కోట్లు కొల్లగొట్టిన చిత్రంగా కెజిఎఫ్ 2 రికార్డ్ సృష్టించింది. అలాగే యశ్ - ప్రశాంత్ నీల్ హిందీలో అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతున్నారు. నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ కెజిఎఫ్ చాప్టర్ 2 కి బాగా కలిసొచ్చింది. అలాగే కెజిఎఫ్ చాప్టర్ 2 అసలు కథ సోమవారం వర్కింగ్ డే కి మొదలవుతుంది అన్నప్పటికీ.. సోమవారం కూడా థియేటర్స్ ఆక్యుపెన్సీ ఫుల్ గానే ఉన్నట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఐదో రోజున కెజిఎఫ్ చాప్టర్ 2 సత్తా చాటి 600 కోట్ల క్లబ్బులోకి ఎంటర్ అయినా అవ్వొచ్చని అంటుంటే.. ఇప్పుడు కెజిఎఫ్ మేకర్స్ 546 కోట్ల కలెక్షన్స్ పోస్టర్ ని షేర్ చెయ్యడంతో యశ్ ఫాన్స్, మాస్ ఫాన్స్ అధికారిక పోస్టర్ ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. 

KGF Chapter 2 546 cr poster viral :

KGF Chapter 2: 546 cr collections poster viral 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs