మెగాస్టార్ చిరంజీవి - రామ్ చరణ్ కలయికలో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య మూవీ విడుదలకు టైం దగ్గర పడుతుంది. ఆచార్య సినిమాలో రామ్ చరణ్ కూడా నటించడంతో ఆ సినిమాపై ఆడియన్స్ లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇక ఏ నెల 29 న విడుదల కాబోతున్న ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఏపీ సీఎం జగన్ హాజరు కాబోతున్నారని, అది కూడా విజయవాడ వేదికగా ఆచార్య ఈవెంట్ జరగబోతుంది అంటూ ప్రచారం జరిగినా.. మేకర్స్ మాత్రం హైదరాబాద్ లోనే ఈనెల 23 న ఆచార్య ఈవెంట్ అంటూ అఫీషియల్ ప్రకటన ఇచ్చారు.
ఇక విజయవాడ లో జరిగే ఆచార్య ఈవెంట్ లో ఏపీ సీఎం జగన్ కి సత్కారం.. పవన్ ని అవమానించేలా చిరు ప్లాన్ ఇలా ఏవేవో ప్రచారాలు జరిగినా.. అవన్నీ రూమర్స్ అంటూ కొట్టిపారేశారు మేకర్స్. హైదరాబాద్ లో జరగబోయే ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ ఫైనల్ అయినట్లుగా తెలుస్తుంది. అది కూడా పవన్ కళ్యాణ్ తన అన్న చిరు కోసం రాబోతున్నారట. పవన్ ముఖ్య అతిథిగా చిరు, చరణ్ ల ఆచార్య ఈవెంట్ పెద్ద ఎత్తున ప్లాన్ చేశారట మేకర్స్.