ప్రభాస్ మాస్ అవతార్ లో కనిపించనున్న సలార్ మూవీ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ గా మొదలు పెట్టారు. ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంది. ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ 2 తో పాన్ ఇండియా మార్కెట్ ని కొల్లగొట్టడంతో ఇప్పుడు ప్రభాస్ సలార్ పై అంచనాలు పెరిగిపోతున్నాయి. సలార్ లో ప్రభాస్ ఎలివేషన్ ని ఊహించుకుంటూ ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. ప్రభాస్ కూడా మాస్ లుక్ లోనే సలార్ లో కనిపించబోతున్నారు. అయితే కెజిఎఫ్ 2 ప్రమోషన్స్ లో సలార్ టీజర్ మే ఎండింగ్ లో వదులుతున్నట్లుగా ప్రశాంత్ నీల్ చెప్పారు.
ఇప్పుడు సలార్ పై మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ బయటికి వచ్చింది. అదేమిటంటే సలార్ మూవీ రెస్యూమ్ షూట్ మే ఫస్ట్ వీక్ లో మొదలు కాబోతుంది అని, దీని కోసం రామోజీ ఫిలిం సిటీలో ఓ సెట్ నిర్మాణం చేపట్టారని, మే ఫస్ట్ వీక్ లో షూట్ మొదలు పెట్టి మే చివరి వారంలో సలార్ టీజర్ ప్లాన్ చేశారట మేకర్స్. ఇక ఈ సినిమాలో ఎనిమిమంది పవర్ ఫుల్ విలన్స్ ఉంటారని.. అందులో జగపతి బాబు ఒకరుగా ఉండబోతున్నారట. శృతి హాసన్ ప్రభాస్ కి జోడిగా నటిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ ఫైట్ ని స్పెషల్ గా డిజైన్ చేసినట్లుగా తెలుస్తుంది.