Advertisement
Google Ads BL

రామ్ సినిమాలో కోలీవుడ్ హీరో స్పెషల్


రామ్ హీరోగా లింగుసామి దర్శకత్వంలో బై లింగువల్ మూవీ గా తెరకెక్కుతున్న సినిమా ది వారియర్. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానున్న ఈ సినిమా కో స్పెషల్ ఉంది. అదేమిటంటే ద వారియర్ కోసం కోలీవుడ్ హీరో శింబు గొంతు సవరించడం. ఈ సినిమాలో బుల్లెట్... సాంగ్‌ను శింబు పాడారు. హీరో రామ్, మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్‌తో ఉన్న ఫ్రెండ్షిప్‌తో శింబు బుల్లెట్... సాంగ్ పడినట్లుగా తెలుస్తుంది. ఇదొక మాస్ నంబర్. సినిమా హైలైట్స్‌లో ఈ సాంగ్ ఒకటి అవుతుంది అని.. దేవిశ్రీ ప్రసాద్ ఫెంటాస్టిక్ ట్యూన్‌కు, శింబు వాయిస్ యాడ్ అవ్వడంతో సాంగ్ సూపర్ గా వచ్చింది అని.. ఈ పవర్ ప్యాక్డ్ సాంగ్ ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటుంది అంటూ ఈ సినిమా నిర్మాత చెబుతున్నారు.

Advertisement
CJ Advs

ఈ సాంగ్ మాత్రమే కాకుండా మిగతా పాటలకూ దేవిశ్రీ హిట్ మంచి ట్యూన్స్ ఇచ్చారు అని, ఇటీవల భారీ ఎత్తున ఇంటర్వెల్ సీన్, హీరో హీరోయిన్లపై ఒక పాటను చిత్రీకరించినట్లుగా ఆయన చెప్పారు. సినిమా షూటింగ్ కూడా చివరి దశకు వచ్చింది. ఆల్రెడీ విడుదల చేసిన రామ్ స్టిల్స్, ఆది పినిశెట్టి లుక్స్, కృతి శెట్టి లుక్స్ ప్రేక్షకులందర్నీ ఆకట్టుకుంటున్నాయి. సినిమాపై అంచనాలు పెంచాయి. ఆ అంచనాలను అందుకునేలా లింగుస్వామి సినిమాను తెరకెక్కిస్తున్నారు అంటూ ఆయన చెప్పారు. హీరోయిన్ గా కృతి శెట్టి విజిల్ మహాలక్ష్మిగా కనిపిస్తుండగా.. ఆది పినిశెట్టి విలిన్ గా కనిపించబోతున్నారు.

Simbu sings Bullet song for The Warriorr :

Simbu sings Bullet song for Ram Pothineni The Warriorr 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs