Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ హనుమాన్ దీక్ష లుక్


యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ సక్సెస్ తర్వాత బాలీవుడ్ మీడియా తో ఇంటరాక్ట్ అయ్యి.. ఆ సినిమా విషయాలను పంచుకున్నారు. అలాగే హైదరాబాద్ లో దిల్ రాజు పార్టీ, ముంబై లో పెన్ మూవీస్ వారు ఇచ్చిన ట్రిపుల్ ఆర్ సక్సెస్ పార్టీలు తర్వాత సడన్ గా మాయమయ్యారు. కారణం ఎన్టీఆర్ హనుమంతుని దీక్ష తీసుకోవడమే. ఎన్టీఆర్ హనుమంతుని పూజిస్తూ ఈ ఏడాది కొత్తగా ఆయన మాల వేసుకుని భక్తి శ్రద్దలతో పూజలు చేస్తున్నారని అంటున్నారు.

Advertisement
CJ Advs

అయితే ఎన్టీఆర్ హనుమాన్ దీక్ష లుక్ ఈ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా బయటికి వచ్చింది. హనుమంతుని బొట్టు రంగులో ఉన్న దుస్తుల్లో ఎన్టీఆర్.. గెడ్డం పెంచి, మెడలో రుద్రాక్ష మాల వేసుకుని నుదుటున బొట్టుతో కనిపించారు. ఎన్టీఆర్ హనుమాన్ దీక్షలో 21 రోజులు పాటు ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ట్రిపుల్ ఆర్ మరో హీరో రామ్ చరణ్ అయ్యప్ప మాలలో ఉన్నారు. ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరు హనుమంతుని మాలలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఎన్టీఆర్ హనుమాన్ మాలాధారణలో కనిపించారు.

Young Tiger NTR Hanuman maladharana look:

Jr NTR to follow 21-day Hanuman Deeksha
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs