ఈనాడు అధినేత రామోజీ రావు పెద్ద కొడుకు కిరణ్ కూతురు బృహతి పెళ్లి రిసెప్షన్ రామోజీ ఫిలిం సిటీలో స్పెషల్ గా వేసిన సెట్ లో అంగరంగ వైభవంగా జరుగుతుంది. రామోజీ రావు ఈనాడు ఈటివి అధినేతగా పొలిటికల్ పరిచయాలు, సినిమా పరిచయాలు ఉండడంతో మనవరాలి పెళ్ళికి సెలబ్రిటీస్ తాకిడి కనిపించింది. రామోజీ రావు ఆయన కొడుకు కిరణ్ ఆయన భార్య, సుమన్ భార్య, సుమన్ కొడుకు అందరూ అతిధులని దగ్గరుండి ఆహ్వానించి నూతన వధూవరులకు అతిధుల చేత ఆశీర్వచనాలు ఇప్పించారు. తెలంగాణ సీఎం కేసీర్, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రమణ, భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మినిస్టర్ హారీష్ రావు అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వంటి సెలబ్రిటీస్ నూతన వధూవరులని ఆశీర్వదించిన వారిలో ఉన్నారు.
ఇక రామోజీ రావు మనవరాలి వెడ్డింగ్ రిసెప్షన్ లో స్పెషల్ అట్రాక్షన్ గా సూపర్ స్టార్ రజినీకాంత్ నిలిచారు. రజినీకాంత్ వధువు బుగ్గలని ముద్దాడుతూ ఆశీర్వచనాలు ఇవ్వడం హైలైటయ్యింది. ఇక మెగాస్టార్ చిరు ఆయన భార్య సురేఖతో హాజరయ్యారు. మోహన్ బాబు, మంచు విష్ణు, అల్లు అరవింద్, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, దేవినేని ఉమా, మురళి మోహ, రాజేంద్ర ప్రసాద్, రాఘవేంద్ర రావు వంటి ప్రముఖులు నూతన వధూవరులని ఆశీర్వదించిన వారిలో ఉన్నారు.