బిగ్ బాస్ లో ఈ వారం కెప్టెన్సీ టాస్క్ రసవత్తరంగా సాగింది. నామినేషన్స్ లో ఎవరైతే ఇద్దరిద్దరు జోడిగా నామినేట్ చేసుకుని విపరీతంగా గొడవ పడ్డారో వారినే మళ్ళీ జోడీలుగా పెట్టి కెప్టెన్సీ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. అందులో ఎనిమీస్ అయిన నటరాజ్ మాస్టర్ - యాంకర్ శివ ఒక జోడిగా, అఖిల్ - బిందు ఒక జోడిగా, మహేష్ -మిత్ర మరొక జోడిగా, అరియనా - అజయ్ మరొక జోడిగా, అనిల్ - హమీద మరొక జోడిగా ఉండి గేమ్ ఆడారు. కెప్టెన్ ఆశు రెడ్డి ని సంచాలక్ చేసారు. అయితే కెప్టెన్సీ టాస్క్ ల్లో పోటీ పడిన వారిలో నటరాజ్ - శివ లు టాప్ లో ఉండగా.. హమీద - అనిల్ కూడా టఫ్ ఫైట్ ఇచ్చారు.
ఇక చివరి టాస్క్ లో అఖిల్, నటరాజ్ వీళ్లంతా కాలు కింద పెట్టారని ఆశు రెడ్డి చెప్పడంతో వాళ్ళకి కోపం వచ్చి కుండ పగలగొట్టగా ఏడు వారాల పోరాటంతో యాంకర్ శివ ఫైనల్ గా కెప్టెన్ అయ్యాడు. సంచాలక్ అయిన ఆశు రెడ్డి ప్రతి టాస్క్ లో సంచాలక్ గా ఫెయిలయ్యింది అంటూ హమీద గట్టిగా అరిచేసింది. ఇక వరెస్ట్ పెరఫార్మెర్ గా ఆశు రెడ్డి కె హౌస్ మేట్స్ ఎక్కువ ఓట్స్ వేశారు. సంచాలక్ గా ఆమె చేసిన తప్పిదాలే ఆమెని వరెస్ట్ పెరఫార్మెర్ గా చేసి జైల్లో కూర్చోబెట్టాయి. దానితో ఆశు రెడ్డి కెప్టెన్ అయ్యుండి జైలు కి వెళ్లి కన్నీళ్లు పెట్టుకుంది.