ఈనెల 29 న రిలీజ్ కి రెడీ అవుతున్న మెగాస్టార్ ఆచార్య మూవీ ప్రమోషన్స్ ని ట్రైలర్ తోనే మొదలు పెట్టింది టీం. ఆచార్య ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డ్ లైక్స్ తో వ్యూస్ తో దూసుకుపోయింది. రామ్ చరణ్ - చిరు కలిసి కనిపించబోతున్న ఈ చిత్రం పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. కొరటాల శివ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా ఉండడం, నక్సల్స్ బ్యాగ్ డ్రాప్ లో సినిమా తెరకెక్కడం, మెగాస్టార్ చిరు - రామ్ చరణ్ కలయికలో సినిమా రావడం, అలాగే హీరోయిన్స్ గా కాజల్, పూజ హెగ్డే లు నటించడం, సోను సూద్ విలన్ గా కనిపించడం ఇలా చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్న ఆచార్య సినిమాపై అందరిలో క్యూరియాసిటీ పెరిగిపోతుంది. ఇప్పటికే ఆచార్య నుండి విడుదలైన టీజర్, సాంగ్స్ అన్ని మెగా ఫాన్స్ కే కాదు అందరికి నచ్చేసాయి.
అయితే ఆచార్య ప్రమోషన్స్ లో భాగంగా ఈ నెల 24 న హైదరాబాద్ లో ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా జరిపేందుకు మేకర్స్ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. చిరు - చరణ్ ఈ ఈవెంట్ కి హాజరవుతారని.. ఇంకా ఈ ఈవెంట్ గా చీఫ్ గెస్ట్ గా పవన్ కళ్యాణ్ రావొచ్చనే ఊహాగానాలు మొదలైపోయాయి. ఆచార్య ప్రమోషనల్ ఈవెంట్ లో కాజల్ కనిపించకపోవచ్చని, ఆమె ప్రెగ్నెంట్ కారణంగా ఆచార్య ప్రమోషన్స్ కి దూరమైనట్టుగా తెలుస్తుంది. ఇక పూజ హెగ్డే ఆచార్య ప్రతి ప్రమోషన్స్ లోను పాల్గొనే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.