Advertisement
Google Ads BL

గాడ్ ఫాదర్ లో పూరి రోల్ రివీల్డ్


మలయాళంలో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన లూసిఫర్ మూవీ ని తెలుగులో మోహన్ రాజా గాడ్ ఫాదర్ గా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. లూసిఫర్ లో లీడ్ కేరెక్టర్స్ కి ఎలాగైతే స్టార్స్ ని ఎంపిక చేసారో.. ఇప్పుడు గాడ్ ఫాదర్ కోసము మోహన్ రాజా అలాంటి స్టార్స్ నటులనే లీడ్ కేరెక్టర్స్ కి ఎంపిక చేసి దీన్నో మల్టీస్టారర్ లా మార్చేస్తున్నారు. గాడ్ ఫాదర్ చిరు కి బాడీ గార్డ్ గా బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, చిరుకి సిస్టర్ గా నయనతార లని తీసుకొచ్చారు. అలాగే లూసిఫర్ లో జర్నలిస్ట్ గా పృథ్వి రాజ్ అన్న నటుడు ఇంద్రజిత్ కనిపించారు.

Advertisement
CJ Advs

అదే కేరెక్టర్ కి తెలుగులో ఓ డైరెక్టర్ కనిపించబోతున్నారని తెలుస్తుంది. ఆయనే పూరి జగన్నాధ్. పూరి జగన్నాధ్ గాడ్ ఫాదర్ లో గెస్ట్ రోల్ చెయ్యబోతున్నారు అని ఈ మధ్యనే గాడ్ ఫాదర్ టీం కం ఫర్మ్ చేసింది. అయితే ఇప్పుడు పూరి గాడ్ ఫాదర్ లో జర్నలిస్ట్ గా కనిపించబోతున్నారట. మరి జర్నలిస్ట్ గా పూరి కథని మలుపు తిప్పే మంచి కేరెక్టర్ చెయ్యబోతున్నట్టుగా ఈ న్యూస్ సారాంశం. దీనినిబట్టి పూరి ని జస్ట్ గెస్ట్ గా కాదు.. కాస్త నిడివి ఉన్న పాత్రలోనే చూడబోతున్నామన్నమాట. ఇక యాంకర్ అనసూయ గాడ్ ఫాదర్ ని మోసం చేసే కేరెక్టర్ లో కనిపించబోతున్నట్టుగా టాక్.

Puri Jagannadh Role Revealed in Godfather:

Director Puri Jagannadh to play a role in Chiranjeevi GodFather
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs