Advertisement
Google Ads BL

వైరల్: అలియా-రణబీర్ ల పెళ్లి చేసిన ఫాన్స్


నిన్న ముంబై లోని వాస్తు అపార్ట్మెంట్ లో అలియా భట్-రణబీర్ ల వివాహం అంగరంగ వైభవంగానే జరిగినా.. ఆ పెళ్లి చాలా సింపుల్ గా అంటే చాలా కొద్దిమంది అతిధులు, కపూర్స్ ఫ్యామిలీ, అలియా భట్ ఫ్యామిలీ మెంబెర్స్ అలాగే కొద్దిమంది సన్నిహితులతో సందడితో వివాహం జరిగిపోయింది. పెళ్లి జరిగిన తర్వాతే అలియా-రణబీర్ ఆ విషయాన్ని ఫొటోస్ తో పాటుగా షేర్ చేసారు. తాము ఐదేళ్లుగా ఏ బాల్కనీ లో అయితే ప్రేమించుకున్నామో.. ఇప్పడు అదే బాల్కనీలో వివాహం చేసుకున్నట్లుగా ప్రకటించింది ఈ జంట. అయితే అలియా భట్ - రణబీర్ కపూర్ ల వివాహ రిసెప్షన్ కూడా చాలా పకడ్బందీ గా కట్టుదిట్టమైన భద్రతా మధ్యన ముంబై లోని తాజ్ లో జరగబోతుంది. అంటే సెలబ్రిటీస్, పొలిటికల్ లీడర్స్ హాజరవుతున్న ఈ రిసెప్షన్ కి ఫాన్స్ కి అలోవెడ్ ఉండదు

Advertisement
CJ Advs

మరి అలియా కి రణబీర్ కి ఇద్దరికి సపరేట్ గా ఫాన్స్ గణం ఉంది. బాలీవుడ్ హీరో - హీరోయిన్ అంటే ఫాన్స్ కి విపరీతమైన ప్రేమ ఉంటుంది. అయితే నిన్న అలియా భట్ - రణబీర్ ల పెళ్లి ఫామిలీస్ మధ్యన జారగగా.. కొంతమంది ఫాన్స్ అలియా ని, రణబీర్ ల పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు బొమ్మలని తయారు చేసి ఆ బొమ్మలకి అలియా, రణబీర్ ల ఫేస్ పోస్టర్స్ పెట్టి పద్దతి ప్రకారం పంతుల గారిచేత వివాహం చెయ్యడం అందరిని ఆకర్షించింది. కలకత్తాలోని అలియా - రణబీర్ ల అభిమానులు ఇలా అలియా బొమ్మ పెళ్లి కూతురు, రణబీర్ బొమ్మ పెళ్లి కొడుకులకి ఘనంగా బెంగాలీ స్టయిల్లో వివాహం చేసి ఊరేగించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

Fans organise Ranbir Kapoor and Alia Bhatt Bengali Wedding:

Alia Bhatt-Ranbir Kapoor Wedding: Fans Get The Couple Married In Bengali Style In Kolkata
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs