Advertisement
Google Ads BL

అలియా భట్ ఆభరణాలు హాట్ టాపిక్


అలియా భట్ కి పెళ్లయిపోయింది. ఐదేళ్ల పాటు ప్రేమించుకుని ఎట్టకేలకి ఏప్రిల్ 14 న పెళ్లి తో ఒకటైన రణబీర్ - అలియా జంట పైనే అందరి కళ్ళు. పెళ్లి లో వైట్ అండ్ వైట్ డిజైనర్ డ్రెస్సులతో మెరిసిపోవడమే కాదు.. వారు వేసుకున్న ఆభరణాలు కూడా హాట్ టాపిక్ గా నిలిచాయి. పెళ్లి కి ముందే రణబీర్ కాబోయే భార్యకి వజ్రాల బ్యాండ్ ఇవ్వడం, అలాగే అలియా భట్ ఖరీదయిన వజ్రాల నల్లపూసలు కట్టించుకోవడం ఆకర్షించింది. అయితే ఆలియా భట్ ధరించిన భారీ మ్యారేజ్ డైమండ్ రింగ్, మంగళసూత్రం రణ్‌బీర్ ప్రేమతో బహుకరించినట్టు సన్నిహితులు చెబుతున్నారు. ఆ ఉంగరం, బ్యాండ్ విలువ దాదాపుగా కోటి రూపాయలు ఉంటుంది అని అంచనా వేస్తున్నారు. 

Advertisement
CJ Advs

అలియా భట్ వేలి రింగ్ దగ్గర నుండి తలకి పెట్టుకున్న పాపిడి బిళ్ళ వరకు అత్యంత ఖరీదైన వజ్రాలతో పొదిగినట్టుగా చెబుతున్నారు. ఈ పెళ్లి డిజైన్స్ అన్ని సబ్యసాచి వారు డిజైన్ చేసినట్టుగా చెబుతున్నారు. ఇక పెళ్లి తర్వాత అలియా భట్ రణబీర్ కపూర్ చీర్స్ కొడుతూ సందడి చెయ్యడమే కాదు, పెళ్ళిలో భారీ కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. ఇక ఈ పెళ్ళికి హరైనవారిలో రణబీర్ కపూర్, అలియా భట్ ఫ్యామిలీ మెంబెర్స్ తో పాటుగా కపూర్ ఖాన్, కరిష్మా కపూర్, మహేష్ భట్, సోని రజ్దాన్, షహీన్ భట్, లవ్ రంజన్, కరణ్ జోహర్, ఆయాన్ ముఖర్జీ, సైఫ్ ఆలీఖాన్ గా బయటికి వచ్చిన ఫొటోస్ చూస్తే తెలుస్తుంది.

ఇక అలియా భట్ - రణబీర్ కపూర్ ల వివాహ రిసెప్షన్ ఈనెల 17 న ముంబై లోని తాజ్ హోటల్ లోనే జరగనున్నట్టుగా తెలుస్తుంది. నిన్నటివరకు భద్రత కారణాల దృష్యా ముంబై తాజ్ హోటల్ వద్దులే అని, వాస్తు అపార్ట్మెంట్ లోనే వీరి రిసెప్షన్ జరగబోతున్నట్టుగా అన్నా.. చివరికి ముంబై తాజ్ హోటల్ లోనే వీరి రిసెప్షన్ కి వేదిక రెడీ అవుతుందట,

Alia Bhatt Wedding Jewellery is a hot topic:

Alia Bhatt and Ranbir Kapoor wedding jewellery designed by Sabyasachi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs