Advertisement
Google Ads BL

కన్నీళ్లతో జబర్దస్త్ కి గుడ్ బై చెప్పిన రోజా


సినిమాల్లో నటించడం మానేసాక.. దాదాపు పదేళ్లుగా ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో కి వన్ అఫ్ ద జేడ్జ్ గా రోజా కొనసాగుతున్నారు. ఆమె మధ్య మధ్యలో జబర్దస్త్ కి బ్రేక్ ఇచ్చినా ఎప్పుడూ శాశ్వతంగా వదల్లేదు. జబర్దస్త్ లో ఉన్నప్పుడే రెండుసార్లు ఎమ్యెల్యేగా గెలిచింది కూడా. అటు పాలిటిక్స్, ఇటు జబర్దస్త్ షో ని హ్యాండిల్ చేస్తున్న రోజా.. ఈటీవీలో ప్రసారం అయ్యే ఫెస్టివ్ ప్రోగ్రామ్స్ లోను చాలా హుషారుగా పాల్గొనేవారు. అయితే ఈ పదేళ్లలో ఎప్పుడూ లాంగ్ బ్రేక్ తీసుకొని రోజా ఇప్పుడు మంత్రిగా ప్రమాణ శ్వీకారానికి ముందే జబర్దస్త్ ని, సినిమాలని ఒదిలేస్తున్నట్టుగా ప్రకటించి అందరికి షాకిచ్చారు.

Advertisement
CJ Advs

ఇక తాజాగా జబర్దస్త్ నుండి వెళ్ళిపోతున్నట్టుగా తన చివరి షో ఇదే అంటూ రోజా జబర్దస్ స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న ప్రోమోని వదిలింది ఈటివి. జబర్దస్త్ కి వచ్చాకే తాను రెండుసార్లు ఎమ్యెల్యే అయ్యి ఇక్కడే మంత్రి పదవి పొందాను అని, మంత్రి కావడంతో బాధ్యతలు పెరిగాయని, జబర్దస్త్ షో కి న్యాయం చెయ్యలేను అని, తనకి సేవ చెయ్యడం చాలా ఇష్టమ్ అని, అందుకే జబర్దస్త్ వంటి ఇష్టమైన కార్యక్రమాలను వదులుకోవాల్సి వస్తోందని భావోద్వేగాలతో చెప్పారు. తనకు అవకాశమిచ్చిన ఈటీవీ యాజమాన్యానికి కృతజ్ఞతలు అంటూ రోజా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక రోజా కన్నీళ్లతో ప్రతి ఒక్క కమెడియన్ కన్నీటి పర్యంతమైన ప్రోమో వైరల్ అయ్యింది. రోజా ని ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికిన ఆ ఎపిసోడ్ త్వరలోనే ప్రసారం చేయబోతున్నారట.

Roja breaks down in tears on Jabardasth stage:

MLA Roja Says GoodBye To Jabardasth Show
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs