ప్రస్తుతం టాలీవుడ్ టాప్ పొజిషన్ కి చేరువలో ఉన్న పూజ హెగ్డే అటు పాన్ ఇండియా మూవీ ఇటు బాలీవుడ్ మూవీస్ తో బాగా బిజీ గా ఉంది. టాలీవుడ్ స్టార్ హీరోలందరితో ఆల్మోస్ట్ జోడి కట్టిన ఈ బుట్టబొమ్మ యంగ్ హీరోలకి లక్కీ హీరోయిన్ గానే మారింది. ఎన్నో ప్లాప్ ల తర్వాత అఖిల్ కి పూజ హెగ్డే మోస్ట్ బ్యాచిలర్ తో హిట్ ఇచ్చింది. ఇక ప్రభాస్ తో నటించిన రాధే శ్యామ్ మూవీ కి నెగెటివ్ టాక్ రావడంతో ఈ బుట్టబొమ్మకి కాస్త షాక్ తగిలింది. అయినప్పటికీ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ బీస్ట్ చేశా కదా అనుకుంది. నిజంగానే బీస్ట్ సినిమాలో విజయ్ - పూజ హెగ్డే కలయికలో వచ్చిన అరబిక్ కుతు సాంగ్ ట్రెండ్ అయ్యింది. రికార్డ్ వ్యూస్ తో అదరగొట్టేసింది. అయితే బీస్ట్ ట్రైలర్ రిలీజ్ టైం లో సింగిల్ షాట్ తో పూజ హేగ్డ్ ని లేపేశారు దర్శకులు నెల్సన్.
ట్రైలర్ లోనే కాదు.. పూజ హేగ్డ్ కి బీస్ట్ మూవీ లో అలాంటి రోల్ నే ఇచ్చారు. మరీ సైడ్ కేరెక్టర్ లాంటి రోల్ అన్నమాట. పాన్ ఇండియా హీరోయిన్, పెద్ద హీరోయిన్ అయిన పూజ కి మరీ అలాంటి తీసిపారేసే కేరెక్టర్ ఇవ్వడం ఆమె ఫాన్స్ కి నచ్చలేదు. పూజ హెగ్డే గ్లామర్ గా కనిపించింది ఓకె.. కానీ ఆమె కేరెక్టర్ కి అస్సలు స్కోప్ లేదు. చిన్న కేరెక్టర్ అయినా విజయ్ సరసన అని ఒప్పుకుందో.. లేదంటే పారితోషకంతో పడేశారో కానీ పూజ హెగ్డేకి బీస్ట్ గట్టి షాక్ ఇచ్చినట్టే. అయినా అంత పెద్ద హీరోయిన్ కి అలాంటి సైడ్ కేరెక్టర్ ఇవ్వడం కరెక్టేనా నెల్సన్.