మంచు విష్ణు సక్సెస్ కి దూరమైన హీరో. గత కొన్నేళ్లుగా మంచు సినిమాలు సినిమాలు చేస్తున్నా అవేమి అతనికి హిట్ ఇవ్వడం లేదు. ఏదో ఇండస్ట్రీలో తమ ఉనికిని చాటుకోవడానికి సినిమాలు చేస్తుంది మంచు ఫ్యామిలీ అనే స్థాయికి వచ్చేసారు మంచు హీరోలు. మోహన్ బాబు సన్ అఫ్ ఇండియా తో సైలెంట్ అయ్యారు. మనోజ్ అహం బ్రహ్మాస్మి అంటూ పాన్ ఇండియా మూవీ మొదలు పెట్టాడు. అది అప్ డేట్ కూడా లేదు. అయితే నిన్న మంచు విష్ణు ఓ ట్వీట్ చేసాడు. ఢీ సినిమాకి 15 ఏళ్ళు నిండడంతో దానిని సూచిస్తూ 15 years ago, today was❤️ అంటూ ట్వీట్ చేసాడు. దానికి అందరూ కంగ్రాట్స్ చెప్పాలి కానీ.. ట్రోల్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.
నీ కెరీర్ లో ఢీ ఒక్కటే బ్లాక్ బస్టర్ హిట్.. దానికి సీక్వెల్ అంటున్నారు ఆ అప్ డేట్ ఎప్పుడు అని ఒక నెటిజెన్ రిప్లై ఇస్తే.. ఇంకో నెటిజెన్.. అది బ్లాక్ బస్టర్ కాదు బ్రో జస్ట్ హిట్ అన్నాడు. ఇంకొకరు మంచు విష్ణు సాధించింది ఏం ఉంది.. సినిమాలు మానేస్తే బెటర్ అనగా.. అయ్యో మా అధ్యక్షుడిగా సాధించాడుగా అంటూ మరొకరు కామెంట్ చేసారు. అంటే మీరు యాక్టింగ్ మానేసి పదిహేనేళ్లు అవుతుందన్నమాట.. . మీరు యాక్షన్ కాదు ఓవరేక్షన్ చేస్తున్నారు అని, మా ఎలక్షన్స్ హామీలు ఇచ్చారు. మా బిల్డింగ్ కట్టేస్తా అన్నారు ఆ వ్యవహారం ఎంతవరకు వచ్చింది అంటూ మంచు విష్ణు గాలి తీసేసారు.
పాపం విష్ణు ఢీ తో 15 ఏళ్ళ క్రితం హిట్ కొట్టా అని సంతోషంతో విషయాన్ని పంచుకుంటే.. నెటిజెన్స్ మాత్రం విష్ణు ట్వీట్ కోసమే కాచుకుని కూర్చున్నట్టుగా ట్రోల్స్ మొదలు పెట్టారు.