సూపర్ స్టార్ రజినీకాంత్ గత కొన్నేళ్లుగా అభిమానుల కోసమే సినిమా చేస్తున్నారా? లేదంటే ఆయనకి కథలు చెప్పే దర్శకులు రజినీకాంత్ హీరోయిజానికి పడిపోయి ఫాన్స్ కోసం కథలు రాస్తున్నారా? అనేది అందరిలో కలిగే అనుమానం. రజినీకాంత్ తో పని చేసే దర్శకులలో ఈ మధ్యన ఆయన ఫాన్స్ ఎక్కువగా ఉంటున్నారు. కార్తిక్ సుబ్బరాజు, శివ, ఆఖరికి మురుగదాస్ కూడా తన స్టయిల్ ని వదిలేసి రజిని ఫాన్స్ కోసమే దర్భార్ సినిమా చేసినట్లుగా అనిపించింది. అటు రజిని కూడా కథల ఎంపికలో తడబడుతున్నారు. హీరో ఎలివేషన్ ఉంటే సరిపోతుంది అదే కావాలి ఫాన్స్ కి అన్నట్టుగా వరస సినిమాలు చేసేస్తున్నారు. కానీ రజినీకాంత్ స్టయిల్ కి ఆయన మ్యానరిజానికి సరిపోయే స్టోరీ తగలడం లేదు. దానితో వరస ప్లాప్స్ ఆయన ఖాతాలోకి వెళుతున్నాయి.
ఇక ఇప్పుడు విజయ్ కూడా రజినీకాంత్ వేసిన బాటలో పయనిస్తున్నాడా? ఆయన కూడా ఫాన్స్ కి మెచ్చే సీన్స్ ఉంటే సినిమా హిట్ అవ్వుద్ది అని నమ్ముతున్నాడా? అనేది గత కొన్ని సినిమాల నుండి తరచూ రిపీట్ అవుతుంది. నెల్సెన్ చిన్న దర్శకుడే.. కానీ విజయ్ ఇమేజ్ కి క్రేజ్ కి తగ్గ కథని అలోచించి సినిమా చెయ్యాలి కానీ.. కథలో ఎక్కడా చూసినా హీరో ని ఎలివేట్ చేస్తూ.. హీరోయిజం చూపించేస్తే ఫాన్స్ విజిల్స్ వేస్తారు, థియేటర్స్ లో రచ్చ చేస్తారు అని నమ్మితే బీస్ట్ ఫలితంలా ఉంటుంది. బీస్ట్ కేవలం ఫాన్స్ కోసమే సినిమా తీసాడు దర్శకుడు, అది కూడా విజయ్ ఫ్యాన్ అయ్యుండి ఈ కథని రాసుకున్నాడా? అనిపించేలా ఉంది ఆ సినిమా. అటు విజయ్ ఫాన్స్ కి కూడా సినిమా నచ్చలేదంటే నెల్సన్ ఎలాంటి కళాఖండాన్ని తెరకెక్కించాడో తెలుస్తుంది. మొదటి షో కె బీస్ట్ కి డివైడ్ టాక్ వచ్చేసింది. సో విజయ్ ఇప్పటికైనా కథల ఎంపికలో దృష్టి పెట్టాలి అని ఆయన ఫాన్స్ డిమాండ్ చేస్తున్నారు.