ఈ రోజు వరకు కెజిఎఫ్ 2 కి కోలీవుడ్ లో బీస్ట్ మూవీ పోటీ ఇస్తుంది.. బీస్ట్ మూవీ తో కెజిఎఫ్ కలెక్షన్స్ కి దెబ్బ పడుద్ది.. అటు హిందీ, ఇటు తెలుగులోనూ కెజిఎఫ్ 2 కి బీస్ట్ పోటీ ఖాయమంటూ బీస్ట్ vs కెజిఎఫ్ 2 అంటూ సోషల్ మీడియాలో హడావిడి నడిచింది. విజయ్ కూడా కెజిఎఫ్ పై పోటీకి సిద్ధమయ్యారు. కెజిఎఫ్ పాన్ ఇండియా మూవీ గా విడుదలవుతున్నా ఒక రోజు ముందే తగ్గేదేలే అంటూ బీస్ట్ ని రిలీజ్ చేసారు. భారీ హైప్ మధ్యన ఎన్నో అంచనాలతో థియేటర్స్ కి వెళ్లిన ప్రేక్షకులు బీస్ట్ థియేటర్స్ నుండి ఉసూరుమంటూ బయటికి రావడం చూసిన యశ్ ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు.
మరికొన్ని గంటల్లో వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కెజిఎఫ్ 2 మూవీ కి ఎలాంటి అడ్డంకి లేదు.. మొదటి రోజు తోనే బీస్ట్ కి నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అవడంతో ఆ సినిమా పనైపోయింది.. లేదంటే కెజిఎఫ్ కలెక్షన్స్ కి కోత పడేది.. సో ఇప్పుడు ఎలాంటి టెంక్షన్ లేదు.. కెజిఎఫ్ కి అన్ని భాషల్లో లైన్ క్లియర్ అంటూ ఫాన్స్ హ్యాపీ గా ఖుషీగా కెజిఎఫ్ థియేటర్స్ దగ్గర హడావిడి మొదలు పెట్టారు. యాష్ కి ముంబై లోని ఓ థియేటర్ దగ్గర భారీ కటౌట్ పెట్టడం అందరిని ఆకర్షించింది. హిందీలో ఎలాగూ జెర్సీ రేస్ నుండి తప్పుకుంది. ఇప్పుడు బీస్ట్ కి ప్లాప్ టాక్ అవడంతో యశ్, కెజిఎఫ్ మేకర్స్ ఫుల్ హ్యాపీ గా ఉన్నారు. మొదటి రోజుతోనే కెజిఎఫ్2 రికార్డ్ కలెక్షన్స్ కొల్లగొట్టడానికి సిద్ధంగా ఉంది.