యష్ హీరోగా నటించిన కెజిఎఫ్ 2 మరికొన్ని గంటల్లో ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. కెజిఎఫ్ లాంటి భారీ హిట్ తర్వాత దానికి సీక్వెల్ గా వస్తున్న చాప్టర్2 పై విడుదలవుతున్న అన్ని భాషల్లో అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. కన్నడ సినిమా ఇండస్ట్రీని కెజిఎఫ్ తో అంతెత్తుకు పెంచిన ప్రశాంత్ నీల్ - యశ్ లు కెజిఎఫ్ 2 తో మరోసారి ఆడియన్స్ ని మాస్ గా పడెయ్యడానికి రెడీ అవడమే కాదు.. పాన్ ఇండియా లెవల్లో ప్రమోషన్స్ చేసారు. తెలుగు ప్రమోషన్స్ లో యశ్ మీడియా తో ఇంటరాక్ట్ అవడం, ఇక్కడి దేవుళ్ళని సందర్శించడం.. ఇలా చాలా బాగా ప్రమోషన్స్ ని ముగించారు.
అయితే యశ్ కెజిఎఫ్ తెలుగు ఇంటర్వ్యూలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ల గురించి చెప్పి ఆ ఇద్దరి ఫాన్స్ ని బుట్టలో వేసుకున్నారు. చరణ్, ఎన్టీఆర్ తో తనకి ఉన్న అనుబంధాన్ని బయట పెట్టాడు. హైదరాబాద్ కి షూటింగ్ కి వచ్చినప్పుడు చరణ్ కలుస్తాడని, ఆయన ఇంటి నుండి కేరియర్ పంపిస్తారని, మా ఇద్దరం ఒకరిని ఒకరు గౌరవించుకుంటామని చెప్పిన యశ్.. తారక్ తో తనకున్న అనుబంధాన్ని వివరించాడు. అటు ఎన్టీఆర్ తోను చరణ్ తో ఉండే రిలేషనే ఉంది అని, ఓసారి హైదరాబాద్ వచ్చినప్పుడు తారక్ ఇంటికి వెళ్లగా వాళ్ళ అమ్మగారు చూపించిన ప్రేమని, వారిచ్చిన ఆతిధ్యాన్ని ఎప్పటికీ మరిచిపోలేను అని, కన్నడ బంధం మమ్మల్ని కలిపింది అని చెప్పిన యశ్.. తెలుగు ఆడియన్స్ అందరిలో కెల్లా గొప్పవాళ్లంటూ పొగిడేసాడు.