మెగా ఫ్యామిలీ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుండి పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు నాగబాబు, ఇక రామ్ చరణ్ వీళ్లంతా దీక్షలు చేపడతారు. చిరంజీవి ఆంజనేయస్వామి భక్తుడు. ఆయన ఆ మాలలో ఎక్కువ కనిపిస్తారు. ఇక రామ్ చరణ్ అయ్యప్ప స్వామి దీక్షలో కనిపిస్తారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా అప్పుడప్పుడు లక్ష్మీ నరసింహ స్వామి దీక్ష చేస్తారు. అయితే ఇప్పుడు మెగా ఫ్యామిలీ హీరోలే కాదు, తారక్ కూడా ఓ దీక్ష చేస్తున్నట్లుగా తెలుస్తుంది.
ఎన్టీఆర్ ఆంజనేస్వామి మాలలో ఉన్నారని, ఆ దీక్ష ఓ 21 రోజుల పాటు ఉంటుంది అని తెలుస్తుంది. అసలు ఎప్పుడూ ఎలాంటి దీక్ష కానీ, ఆంజనేయ స్వామి దీక్ష చేయని తారక్ తొలిసారి అలాంటి దీక్ష చేయడం అందరిని ఆశ్చర్యానికి కలిగిస్తుంది. అయితే ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ బ్లాక్ బస్టర్ హిట్ రావడంతోనే ఆయన అలా దీక్ష చేపట్టారని తెలుస్తుంది. ఎన్టీఆర్ ఇటు ఆంజనేయస్వామి దీక్షలో ఉంటే మరో హీరో రామ్ చరణ్ అయ్యప్ప మాలలో ఉన్నారు.