ప్రభాస్ తో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఆదిపురుష్ అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఆదిపురుష్ మోడ్రెన్ రామాయణం గా ఉండబోతుంది అంటూ దర్శకుడు ఎప్పుడో చెప్పారు మోడ్రెన్ రామగా ప్రభాస్, సీత గా కృతి సనన్ నటిస్తున్న ఈ సినిమాలో రావణ్ గా లంకేశ్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ కనిపిస్తున్నారు. ఇప్పటికే ఆదిపురుష్ షూటింగ్ పూర్తవగా.. ఈ సినిమా విఎఫెక్స్ పనుల్లో ఓం రౌత్ బిజీగా ఉన్నారు. లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవ్ దత్త కనిపించనున్న ఈ సినిమాలో బోల్డ్ బ్యూటీ సోనాల్ చౌహన్ కూడా నటిస్తుంది అంటూ వార్తలు రావడం వాటిని సోనాల్ కంఫర్మ్ చెయ్యడం జరిగింది.
సోనాల్ చౌహన్ కి తెలుగులో బాలకృష్ణ, రామ్ సరసన నటించినా పెద్దగా క్రేజ్ రాలేదు. ప్రస్తుతం నాగార్జున సరసన ద ఘోస్ట్ మూవీ లో నటిస్తుంది. బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న సోనాల్ ఇప్పుడు ఆదిపురుష్ లో నటిస్తుంది అనగానే ఆమె ఏ పాత్రలో కనిపిస్తుందో అనే ఆత్రుత అందరిలో ఎక్కువైంది. సోనాల్ చౌహాన్ రావణాసురుడి భార్య అయిన మండోదరి పాత్రలో లేకపోతే.. లక్షణుడి భార్య అయిన ఊర్మిళ పాత్రలో నటించే అవకాశాలున్నాయి అని తెలుస్తుంది. ప్రభాస్ పక్కనే నటించడానికి అవకాశం దొరక్కపోయినా, ఆయన సినిమాలో నటించడం పట్ల సోనాల్ చౌహన్ చాలా హ్యాపీ గా ఉంది.