Advertisement
Google Ads BL

బీస్ట్ ప్రీమియర్ షో టాక్


కోలీవుడ్ స్టార్ హీరో విజయ్- నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కిన బీస్ట్ మూవీ అరబిక్ కుతూ సాంగ్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది. బీస్ట్ సినిమాకి అనిరుద్ అందించిన మ్యూజిక్, విజయ్, పూజ హెగ్డే క్లాస్ స్టెప్స్, జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అన్ని, ఆ సాంగ్ ఇప్పటికి యూట్యూబ్ లో ట్రెండ్ అయ్యేలా చెయ్యడంతో సినిమాపై విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి. డాక్టర్ సినిమాతో 100 కోట్ల క్లబ్బు లోకి అడుగుపెట్టిన నెల్సన్ దిలీప్ కుమార్ విజయ్ ని ఎలా ప్రెజెంట్ చెయ్యబోతున్నాడో అనే ఆత్రుత తమిళ ఆడియన్స్ లోనే కాదు ఇటు విజయ్ కి మంచి మర్కెట్ ఉన్న తెలుగు ఆడియన్స్ కి కలిగింది. నేడు తమిళ సంవ‌త్స‌రాది సంద‌ర్భంగా ఏప్రిల్ 13న బీస్ట్ సినిమాను వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేసారు. ఇప్పటికే ఓవర్సీస్ లో ప్రీమియర్స్ పూర్తవడంతో అక్కడి ఆడియన్స్ బీస్ట్ పై తమ అభిప్రాయాలని సోషల్ మీడియాలో ఉంచుతున్నారు.

Advertisement
CJ Advs

బీస్ట్ ఓవర్సీస్ టాక్ ఎలా ఉంది అంటే.. విజయ్ బీస్ట్ లో స్పెషల్ ఏజెంట్ గా స్టైలిష్ లుక్ లో కనిపించారట. సినిమా చూసి బయటికి వచ్చిన వారు బీస్ట్ సినిమాకు మిక్స్‌డ్ టాక్ ఇస్తున్నారు. కొంత మంది మూవీ బాగుందని, కొందరు బాలేదని ట్విట్టర్ వేదికగా పోస్టులు చేస్తున్నారు. ఫస్టాఫ్ మొత్తం విజయ్ మాస్ ఇంట్రో సీన్‌తో పాటు ఇంటర్వెల్ ట్విస్ట్‌తో యాక్షన్ ప్యాక్‌లా కూల్ గా వెళుతుందట. ఫస్ట్ హాఫ్ లో కామెడీ కూడా మిక్స్ చెయ్యడంతో కాస్త ఆహ్లాదంగా ఉంది అంటున్నారు. ఇక ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ భిన్నంగా ఉంటుందట. సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్ ఎపిసోడ్స్ తోనే నింపేసినట్లుగా చెబుతున్నారు. విజయ్ పెరఫార్మెన్స్, క్యారెక్టరైజేషన్, ఇంట్రడక్షన్ సీన్ బాగున్నాయట. అలాగే అరబిక్ కుతూ సాంగ్, బ్యాగ్రౌండ్ స్కోర్, కామెడీ, యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్‌గా ఉండగా.. కథలో కొత్తదనం లేకపోవడం, లాజిక్ లేని సీన్స్, లవ్ ట్రాక్ మైనస్‌గా మారాయని టాక్. బీస్ట్ కేవలం విజయ్ ఫాన్స్ కి మాత్రమే అంటూ ఓవర్సీస్ ప్రేక్షకులు తమ అభిప్రాయమని తెలియజేస్తున్నారు. 

Beast Premiere Show Talk:

Vijay Beast Social Media Talk
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs