తారక్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. చరణ్ తో కలసి ట్రిపుల్ ఆర్ తో అద్భుతమైన సక్సెస్ అందుకున్నారు. అయితే చరణ్-ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా చేసిన ఆర్ ఆర్ ఆర్ మూవీలో చరణ్ రోల్ కన్నా తారక్ రోల్ తక్కువ, చరణ్ కి పవర్ ఫుల్ సీన్స్ పడ్డాయి. తారక్ ఎక్కడో కొద్దిగా చరణ్ కన్నా తక్కువయ్యాడనే ఫీలింగ్ అటు ఫాన్స్ లోనే కాదు ఇటు విమర్శకుల్లోనూ ఉంది. చరణ్ ఎన్టీఆర్ ని డామినేట్ చేసాడనే మాటకు చరణ్ కూడా ఒప్పుకోలేదు. తాజాగా ఈ విషయమై ట్రిపుల్ ఆర్ డైరెక్టర్ రాజమౌళి తన స్టయిల్లో ఆన్సర్ ఇచ్చారు.
ఎన్టీఆర్ గొప్ప నటుడు, చరణ్ మంచి నటుడు. ఈ విషయం అందరికి తెలిసిందే. కానీ చరణ్ ఇంతబాగా నటించగలడని ఎవరూ ఊహించలేదు. అతని పెరఫార్మెన్స్ కి అందరూ అవాక్కవుతున్నారు. అది నాకు గర్వంగా ఉంది. నా డైరెక్షన్ లో ఆ నటన బయటికి రావడం నాకు సంతోషాన్నిచ్చింది.
ఇక ఆర్ ఆర్ ఆర్ లో ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అనే విషయంలో రామ్ చరణ్ క్లైమాక్స్ లో ఎక్కువ ఉన్నాడు. బాగా చేసాడు, చరణ్ ఎలివేషన్ బావుంది అని అందరూ అంటున్నారు. ఒకవేళ సినిమాని కొమరం భీముడా అనే పాట దగ్గర ఆపేస్తే.. అక్కడ ఎన్టీఆర్ హైలెట్ అయ్యేవాడు. కానీ క్లైమాక్స్ చూసి బయటికి వచ్చాక చరణ్ గురించి మాట్లాడుకుంటున్నారు. కొమరం భీముడొ సాంగ్ లో తారక్ నటించినట్లుగా ఇండియాలోని ఏ నటుడు నటించలేడేమో.. ఒకే షాట్ లో ఫేస్ లో బాధ, నొప్పి, మాతృభూమిపై ప్రేమ ఇలా అన్నీ చూపించేశాడు అంటూ ఎన్టీఆర్ ని రాజమౌళి ఆకాశానికెత్తేయ్యడం చూసైనా ఎన్టీఆర్ ఫాన్స్ శాంతిస్తారేమో చూడాలి.