Advertisement
Google Ads BL

మీడియా కి నాకు అలా గ్యాప్ వచ్చేసింది: విజయ్


కోలీవుడ్ యాక్టర్ విజయ్ సినిమాలు చేస్తారు. కానీ ఆ సినిమా ప్రమోషన్స్ లో పెద్దగా కనిపించరు. అంతేకాదు ఆయన ఎలాంటి ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భాలు గత కొన్నేళ్లుగా ఎక్కడా కనిపించలేదు. అయితే ఆయన మీడియాకి ఎందుకు ఇంటర్వ్యూలు ఇవ్వరో బీస్ట్ తో చాలా రోజుల తర్వాత ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పడం హైలెట్ అయ్యింది. అది తాను మీడియా కి దూరమై పదేళ్లు అయినట్టుగా చెప్పి విజయ్ చాలా పెద్ద షాక్ ఇచ్చారు. అయితే తాను మీడియా కి దూరంగా ఉండడానికి కారణం పదేళ్ల క్రితం జరిగిన ఓ ఘటనే అని చెప్పారు. అది అప్పట్లో ఓ సినిమా ఇంటర్వ్యూలో పాల్గొన్న తాను ఆ మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడింది ఒకటైతే వాళ్ళు వేరేగా రాశారట. ఆ తర్వాత రోజు తాను ఆ ఇంటర్వ్యూ చూసి షాకయినట్లుగా చెబుతున్నారు విజయ్. 

Advertisement
CJ Advs

ఆ ఇంటర్వ్యూ కాంట్రవర్సీ అయ్యింది అని, తన ఫ్యామిలీ వాళ్ళు కూడా నువ్వెంటి ఇలా మాట్లాడడం అంటూ ఆశ్చర్యపోయారని కానీ తాను మాట్లాడింది వాళ్ళకి చెప్పాను.. అందరికి చెప్పలేను అని, అందుకే మీడియా తో కొద్దిగా డిస్టెన్స్ మెయింటింగ్ చేద్దామనుకుంటే.. ఆ గ్యాప్ పదేళ్ళపాటు వచ్చేసింది అని చెప్పారు విజయ్.

అంతేకాకుండా తాను గత తమిళనాడు ఎన్నికల్లో సరదాగా సైకిల్ మీద వచ్చినా అదో పెద్ద న్యూస్ అయ్యింది అని, అసలు పోలింగ్ బూత్ కి వెనకాలే తమ ఇల్లు ఉంది అని, ఓటు వెయ్యడానికి ఇంటి నుండి బయలు దేరగానే తన కొడుకు నాన్నా మీరు సైకిల్ వేసుకుని వెళ్ళండి, పక్కనే కదా పోలింగ్ బూత్ అనడంతో సైకిల్ తీసాను అని, కానీ అదొక న్యూస్ అయ్యింది అని, లైవ్  లో వేస్తూ ఛానల్స్ హడావిడి చేసినట్లుగా చెప్పారు విజయ్. ఆ తర్వాత నా కొడుకు ఫోన్ చేసి నాన్నా నా సైకిల్ బాగానే ఉందా అని అడగడంతో నవ్వొచ్చింది అంటూ విజయ్ బీస్ట్ దర్శకుడు నెల్సేన్ తో చేసిన ఇంటర్వ్యూలో సరదాగా చెప్పుకొచ్చారు. 

That's Why I Stayed Away From Media For 10 Years: Vijay:

Vijay Interview about Beast Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs