Advertisement
Google Ads BL

500 మంది డ్యాన్సర్లతో నాని దసరా సాంగ్


తన ప్రతి సినిమాకి విభిన్నమైన కథలు ఎంచుకుంటూ ప్రేక్షకులుని అలరిస్తున్న నేచురల్ స్టార్ నాని హీరోగా టాలెంటెడ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్ గా దసరా చిత్రం రూపొందుతోంది. ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి తన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్ పై దసరాను భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

Advertisement
CJ Advs

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ తెలంగాణ, పెద్దపల్లి జిల్లా, గోదావరిఖనిలో జరుగుతుంది. చిత్రీకరణలో భాగంగా నాని, కీర్తి సురేష్ పై భారీ స్థాయిలో పాటని షూట్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో నాటునాటు పాటలో సంచలన స్టెప్స్ సృష్టించిన ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఈ పాటకు కోరియోగ్రఫీ అందిస్తున్నారు. దాదాపు500 మంది డ్యాన్సర్లతో ఈ పాటని గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. ప్రేక్షకులని అలరించడమే లక్ష్యంగా మండు వేసవిని సైతం లెక్క చేయకుండా ఈ పాట కోసం చిత్ర యూనిట్ కష్టపడి పనిచేస్తుంది.

జాతీయ అవార్డు విజేత కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న నాని తొలి పాన్ ఇండియా చిత్రంగా రాబోతుంది.

ఇటివలే విడుదలైన దసరా గ్లింప్స్ ప్రేక్షకులుని ఆకట్టుకుంది. నాని బీడీ వెలిగించి సింగరేణిలో తన గ్యాంగ్‌తో కలిసి వస్తున్న అగ్రెసివ్ యాటిట్యూడ్‌ కనిపించడం సినిమాతో పాటు నాని పాత్రపై కూడా అంచనాలు పెంచింది.

Nani Dasara Song Shoot In Godavarikhani:

Nani, Srikanth Odela, SLVC Dasara Song Shoot In Godavarikhani <div></div>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs