ఎట్టకేలకు జగనన్న కేబినెట్ లో రోజా జబర్దస్త్ గా మంత్రి పదవి సంపాదించింది. గత రెండున్నరేళ్లుగా మంత్రి అవుదామనుకున్న రోజాని నిరాశ పరుస్తూ వచ్చిన సీఎం జగన్ చివరికి రోజా కి మంత్రి పదవిని కట్టబెట్టారు. దానితో రోజా సీన్ నుండి తప్పుకుంది అంటే.. సినిమాలు, ఘాటింగ్ లకి రోజా గుడ్ బై చెప్పేసింది. గత పదేళ్లుగా సినిమాల్లో నటించకపోయినా.. జబర్దస్త్ షో కి ఓ జేడ్జ్ గా వ్యవహరిస్తున్న రోజా.. జబర్దస్త్ లో ఎన్ని రాజకీయాలు జరిగినా, రాజకీయాల్లో ప్రతి పక్షం ఎన్ని మాటలన్నా జబర్దస్త్ షో ని వదల్లేదు. చిన్న చిన్న అవసరాల కోసం కొద్దిగా బ్రేక్ తీసుకున్నా మళ్ళీ వెంటనే జబర్దస్త్ షూటింగ్ కి వచ్చేసేది రోజా.
ఈమధ్యన తరచూ జబర్దస్త్ లో రోజా మిస్ అవడంతో మంత్రి పదవి పక్కా కాబట్టే రోజా జబర్దస్త్ వదిలేస్తుంది అంటూ ప్రచారం జరుగుతుంది.ఆ ప్రచారం జరిగినట్టుగానే రోజా అధికారికంగా సినిమాలు, షూటింగ్ లు వదిలేస్తున్నట్లుగా ప్రకటించింది. తాజాగా మీడియా తో మాట్లాడుతూ.. సినిమాలకు, జబర్దస్త్ షోకు గుడ్ చెపుతున్నట్టు ప్రకటించారు. మంత్రిగా తన పూర్తి సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుందని... ఈ సమయంలో సినిమాలు, షోలకు సమయం కేటాయించలేనని రోజా తెలిపారు. అంతేకాకుండా జగనన్న ఏ పదవి ఇచ్చినా దానికి న్యాయం చేస్తాను అని స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. జబర్దస్త్ కి పదేళ్లుగా జేడ్జ్ గా వ్యవహరిస్తున్న రోజా ఇప్పుడు మంత్రి పదవి కోసం దానిని పక్కనబెట్టేసింది. ఇక రోజా అఫీషియల్ గా ప్రకటన ఇవ్వడంతో ఆమె జబర్దస్త్ లో ఇక కనబడదు. అది ఫిక్స్. రంగురంగుల డిజైనర్ వెర్ లతో జేడ్జ్ గాను, ఈ మధ్యన స్కిట్స్ పెరఫార్మెన్స్ తో టాలెంట్ చూపించిన రోజా ఈ మంత్రి పదవి ఉన్నంత కాలం ఇక టివి షోస్, సినిమాల్లో కనిపించనట్లే.