Advertisement
Google Ads BL

ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ తో ఆదిపురుష్ అప్ డేట్


శ్రీరామనవమి వచ్చేసింది.. ప్రభాస్ ఫాన్స్ ఆదిపురుష్ నుండి ఏమైనా అప్ డేట్ వస్తుందేమో అని తెగ ఆశ పడ్డారు. ఎందుకంటే ఆదిపురుష్ లో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నారు. అందుకే ప్రభాస్ ఆదిపురుష్ పోస్టర్ ఈ రామనవమికి పక్కా అనుకుంటూ ప్రభాస్ ఫాన్స్ సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా హల్ చల్ చేసారు. అయితే శ్రీరామనవమి వచ్చేసింది. ఆదిపురుష్ నుండి ఎలాంటి అప్ డేట్ రాలేదు. దానితో ప్రభాస్ ఫాన్స్ బాగా డిస్పాయింట్ అయ్యారు. కానీ దర్శకుడు ఓం రౌత్ మాత్రం ఫాన్స్ కి ఓ ఇంట్రెస్టింగ్ సర్ ప్రైజ్ ఇచ్చారు.

Advertisement
CJ Advs

అదేమిటంటే ఆదిపురుష్ ని ప్రభాస్ హీరోగా అనౌన్స్ చేసినపుడు, ఆ సినిమా మైథలాజికల్ గా రామాయణం ఆధారంగా తెరకెక్కుతుంది అనగానే ప్రభాస్ ని రామావతార్ లో పోస్టర్స్ డిజైన్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. ప్రభాస్ ని రాముడి గా విల్లంబులు చేతబట్టి, పిలక కట్టి, దేవుడి మాదిరిగా చూసుకుని ముసిరిసిపోతున్నారు. మధ్యలో ఓం రౌత్ తన ఆదిపురుష్ రాముడు మోడ్రెన్ రామగా కనిపిస్తారని చెప్పాక మళ్ళీ ప్రభాస్ ని మోడరన్ రామ అవతార్ లో డిజైన్ చేసారు. అలాంటి ఫ్యాన్ మెడ్ పోస్టర్స్ అన్నిటిని కలిపి ఓం రౌత్ ఓ వీడియో రూపంలో షేర్ చేసారు. దానితో పాటుగా

గొప్ప శౌర్యంతో కూడిన సముద్రం,

ప్రేమను కురిపించే అందమైన రూపం

శ్రీరాముడి జన్మించిన వేళ

ఊరు వాడా ఆనందంతో చేసెను నృత్యం.. అంటూ ఓ హిందీ కవితని షేర్ చేసారు. ఆ వీడియో తో ఫాన్స్ ఎగ్జైట్ అయినా కాస్త మూడ్ ఆఫ్ అయ్యారు.

Adipurush: Om Raut Shares Fan Made Posters Of Prabhas Starrer On Ram Navami :

Prabhas First look as Raghav Ram from Adipurush
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs