ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ హవా నడుస్తుంది. ఫిబ్రవరి 25 న భీమ్లా నాయక్ రిలీజ్ టైం లో పవన్ కళ్యాణ్ క్రేజ్ ముందు ప్రమోషన్స్ చేస్తే వెస్ట్ అంటూ రాధే శ్యామ్ టీం భీమ్లా నాయక్ రిలీజ్ తర్వాత ప్రమోషన్స్ మొదలు పెడితే.. రాధే శ్యామ్ రిలీజ్ అయ్యాక రాజమౌళి ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ తో రంగంలోకి దిగిన విషయం కూడా తెలిసిందే. ఇక కెజిఎఫ్ టీం కూడా ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ అయిన రెండో రోజు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించి ప్రమోషన్స్ కి శ్రీకారం చుట్టింది. ఎందుకంటే అంత పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నప్ప్పుడు ఆడియన్స్ అటెంక్షన్ అంతా దానిపైనే ఉంటుంది. కానీ వేరే పెద్ద సినిమా ప్రమోషన్ అయినా పట్టించుకోరు.
కానీ ఇప్పుడు ఆచార్య టీం మాత్రం కెజిఎఫ్ ఏప్రిల్ 14 న రిలీజ్ అవుతుంటే ఓ రెండు రోజుల ముందే ఆచార్య ప్రమోషన్స్ ని ట్రైలర్ లాంచ్ తో మొదలు పెట్టబోతున్నట్లుగా మేకర్స్ అఫీషియల్ ప్రకటన ఇచ్చారు. ఏప్రిల్ 12 న ఆచార్య ట్రైలర్ రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా ప్రకటించారు. ప్రస్తుతం ఇండియా వైడ్ గా కెజిఎఫ్ మ్యానియా ఓ రేంజ్ లో ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్, కెజిఎఫ్ 2 టీం ప్రమోషన్స్ ఇలా సోషల్ మీడియాలో కూడా కెజిఎఫ్ దే హవా.. అలాంటి టైం లో ఆచార్య ట్రైలర్ ఒక్క రెండు రోజులు ఆగి వదిలితే బావుంటుంది కదా.. లేదంటే లైక్స్, వ్యూస్ విషయంలో తేడా పడుద్ది అని మెగా ఫాన్స్ టెంక్షన్ పడుతున్నారు.