Advertisement
Google Ads BL

బిగ్‌బాస్ టాప్ 5లో అతను కన్‌ఫర్మ్


బిగ్ బాస్ సీజన్ 4 తర్వాత పలు షోస్ లోనూ, ఒకటి రెండు సినిమాలు ఒప్పుకుని బిజీ అయిన అఖిల్ సార్థక్.. ఢీ డాన్స్ షోతో బాగా పాపులర్ అయ్యాడు. కానీ ఆ షో మధ్యలోనే బిగ్ బాస్ నాన్ స్టాప్ షోకి అవకాశం రావడంతో పర్సనల్ కారణాలతో బిగ్ బాస్ ఓటీటీలో అడుగుపెట్టాడు. ఇక ఈ సీజన్‌లో అఖిల్‌తో పాటుగా హీరోయిన్ బింధుమాధవి బిగ్ బాస్ టైటిల్ ఫేవరెట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టినా.. ఇప్పుడు అఖిల్‌ని వెనక్కి నెట్టి బింధుమాధవి నెంబర్ వన్‌గా నిలిచేలా కనిపిస్తుంది. దాదాపుగా బిందు టైటిల్ విన్నర్‌గాను, అఖిల్ మళ్ళీ రన్నర్ గాను నిలిచేలా కనిపిస్తుంటే మరో కంటెస్టెంట్ టాప్ 5‌కి ఫిక్స్ అయ్యేలా ఉన్నాడు.

Advertisement
CJ Advs

 

అతనెవరో కాదు యాంకర్ శివ, యూట్యూబ్ ఛానల్‌లో సెలబ్రిటీస్‌ని ఇంటర్వ్యూ చేసే శివ కాంట్రవర్సీ యాంకర్‌గా పాపులర్. అతను బిగ్‌బాస్ నాన్ స్టాప్‌లో ఆట బాగానే ఆడుతున్నా.. అతనికి లక్కు కలిసి రావడం లేదు. అమ్మాయిలని ఫ్లాట్ చేస్తూ గేమ్ విషయంలో గొడవలు పడుతూ, బిగ్‌బాస్‌నే చీట్ చేస్తూ, గేమ్‌లో ఇతర కంటెస్టెంట్స్‌ని చీట్ చేస్తూ హైలెట్ అవుతున్నాడు. కాదు బిగ్ బాస్ కావాలనే హైలెట్ చేస్తున్నాడా అనిపిస్తుంది అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ వారం కెప్టెన్ అవుదామనుకుని కలలు కన్న శివకి హౌస్ మేట్స్ షాకిస్తూ కత్తి దింపడంతో కెప్టెన్సీ ఆశలు ఈ వారం ఆవిరయ్యాయి. అయితే యాంకర్ శివని బిగ్ బాస్ కావాలనే హైప్ చేస్తూ ఏదో ట్విస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడనేలా వార్తలు వినబడుతున్న నేపథ్యంలో.. శివ మాత్రం ఖచ్చితంగా టాప్ 5లోకి వస్తాడని చాలామంది అంటున్నారు. బింధుమాధవితో ఫ్రెండ్ షిప్ చేస్తూ శివ టాప్ 5 లోకి వచ్చినా రావచ్చు అంటున్నారు. చూద్దాం అతని భవితవ్యం ఎలా ఉందో..

Anchor Shiva in Bigg Boss Top 5th Place:

They are Bigg Boss Non Stop show Finalistes
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs