Advertisement
Google Ads BL

టాప్ బన్నీనా.. లేదంటే ఎన్టీఆర్-చరణా?


ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ మీద టాలీవుడ్ హీరోలు దాడి మాములుగా లేదు. ‘బాహుబలి’తో ప్రభాస్ పాన్ ఇండియా మార్కెట్‌లో ఓ రేంజ్ సెట్ చేస్తే.. దానిని బన్నీ ‘పుష్ప’ మూవీతో నిలబెట్టారు. ప్రభాస్ బాహుబలి తర్వాత చేసిన సాహో అట్టట్ట ఆడినా.. బన్నీ పుష్ప‌తో బంపర్ హిట్ కొట్టారు. హిందీలో 100 కోట్ల మార్కెట్‌ని పుష్పతో సొంతం చేసుకున్నారు. అదే పుష్పని పాన్ ఇండియా లెవల్లో ప్రమోట్ చేసినట్లయితే ఇంకాస్త కలెక్షన్స్ వచ్చేవే. బన్నీ సోలోగా కష్టపడి హిట్ కొట్టాడు. ప్రమోషన్స్‌ని ఒంటి చేత్తో చేసుకున్నాడు. పుష్ప‌తో మంచి మర్కెట్ పెంచుకున్నాడు బన్నీ.

Advertisement
CJ Advs

 

మరి మరో పాన్ ఇండియా మూవీ ట్రిపుల్ ఆర్ కోసం దర్శకుడు రాజమౌళితో కలిసి ఎన్టీఆర్ - రామ్ చరణ్ ఇద్దరూ కలిసి కష్టపడ్డారు. ఆ సినిమా పాన్ ఇండియాలో అదిరిపోయే హిట్ కొట్టేసింది. ఎన్టీఆర్ - రామ్ చరణ్ ఇద్దరూ కలిసి కొట్టారు. అక్కడ బన్నీ సోలోగా కొట్టాడు. రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి హిట్ కొట్టారు. అంటే ఇక్కడ ఎవరు గొప్ప? అనే మీమాంశ అందరిలో మొదలైంది. రాజమౌళి ఇప్పటికి ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్‌తో ఇంకా ఇంకా కలెక్షన్స్ రాబడుతున్నారు. అలాగే పుష్ప హిట్ తర్వాత ఏ ఒక్కరూ పార్టీ ఇవ్వలేదు. అల్లు అర్జున్ టీం కి స్పెషల్ పార్టీ ఇచ్చారు. కానీ ట్రిపుల్ ఆర్ హిట్ తర్వాత ఇక్కడ హైదరాబాద్‌లో దిల్ రాజు, అక్కడ హిందీ మేకర్స్ ట్రిపుల్ ఆర్ టీం కి అదిరిపోయే గ్రాండ్ పార్టీ ఇచ్చారు. సో ఇక్కడ పుష్ప - ట్రిపుల్ ఆర్ మధ్యన పోలిక లేదు. కానీ ఎవరు గొప్ప అనే విషయంలో ఫ్యాన్స్ కొట్టుకోకుండా ఆగుతారా!

Fans Fight for who is Top Telugu Hero in Bollywood:

Allu Arjun Pushpa vs Charan and Tarak RRR Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs