ట్రిపుల్ ఆర్ మార్చ్ 25న రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం కలెక్షన్స్ ప్రభంజనంలో టీం ఇంకా ఇంకా తడిసి ముద్దవడమే కాదు.. సక్సెస్ పార్టీ లంటూ సందడి సందడి చేస్తున్నారు. అక్కడ ట్రిపుల్ ఆర్ కలెక్షన్స్ లెక్కకి మించి కనిపిస్తున్నాయని విమర్శలు ఉన్నా.. రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌తో టాలీవుడ్ వైపు మరోసారి ప్రపంచాన్ని చూసేలా చేశారు అనేది మాత్రం నిజం. ఇక థియేటర్స్‌లో బ్లాక్‌బస్టర్ అయిన ట్రిపుల్ ఆర్ ఓటీటీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఈమధ్యన సినిమాలు రిలీజ్ అయిన నెలలోపే ఓటీటీ బాట పట్టేస్తున్నాయి. ‘రాధే శ్యామ్’ అయితే విడుదలైన 20 రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తే.. భీమ్లా నాయక్ నెలకి ఓటీటీలో సందడి చేసింది.
మరి ఇప్పుడు ట్రిపుల్ ఆర్ ఓటీటీ రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్ మాత్రమే కాదు ఫ్యామిలీ ఆడియన్స్‌లో సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.. కాదు కాదు ఇగర్లీ వెయిటింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ట్రిపుల్ ఆర్ రిలీజై రెండు వారాలైంది. కానీ ఇప్పటివరకు ఓటీటీ డేట్ ఇవ్వలేదు. సౌత్‌లో ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయిన అన్ని భాషల ఓటీటీ రైట్స్‌ని జీ-5 దక్కించుకోగా, హిందీలో మాత్రం నెట్ ప్లిక్స్ రిలీజ్ చేస్తుంది. థియేటర్స్‌లో బిగ్గెస్ట్ హిట్ అయిన ట్రిపుల్ ఆర్‌ని ఓటీటీ రిలీజ్ కూడా భారీ సర్‌ప్రైజ్‌తో రిలీజ్ చేస్తారని అంటున్నా.. ఓ పది వారాల వరకు ట్రిపుల్ ఆర్ ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ లేదని సోషల్ మీడియా టాక్. మరి పది వారాల పాటు ఆడియన్స్ ఏమో కానీ.. ఓటీటీలు వెయిట్ చేస్తాయా అనేది అనుమానమే.