Advertisement
Google Ads BL

తేజ.. టాలీవుడ్‌లో 2, బాలీవుడ్‌లో 2!


డైరెక్టర్ తేజ.. పరిచయం అక్కరలేని పేరు. సినిమాటోగ్రాఫర్ నుండి దర్శకుడిగా మారి ఆయన సృష్టించిన సంచలనం అందరికీ తెలిసిందే. నటీనటుల నుండి ఆయన రాబట్టే నటన.. ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటుంది. అయితే గత కొన్నాళ్లుగా అనౌన్స్‌మెంట్స్‌కే తప్ప.. ఆచరణలోకి తన ప్రాజెక్ట్స్‌ని తేలేక పోతున్న తేజ.. ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమంటూ రెండు ప్రాజెక్ట్స్ కూడా ప్రకటించారు. రీసెంట్‌గా తన పుట్టినరోజు సందర్భంగా రెండు తెలుగు చిత్రాలను తేజ ప్రకటించిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు ఆ చిత్రాలు లైన్‌లో ఉన్నాయో.. లేక పక్కన పెట్టేశాడో తెలియదు కానీ.. ఇప్పుడు బాలీవుడ్‌లో తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. ఈ మేరకు తేజ ఇప్పటికే రెండు బాలీవుడ్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టారు. వీటిని టైమ్ ఫిల్మ్స్ ఎన్‌హెచ్ స్టూడియోస్ అండ్ ట్రిఫ్లిక్స్ ఫిల్మ్స్‌తో కలిసి నిర్మించనున్నాయి.

Advertisement
CJ Advs

 

తేజ సైన్ చేసిన రెండు ప్రాజెక్ట్‌లలో ఒకటి ‘జఖమి’. ఇద్దరు బాలీవుడ్ తారలు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్ మొత్తం కశ్మీర్‌లోని మంచు ప్రాంతంలో జరగనుందట. మరో ప్రాజెక్ట్ ‘తస్కరి’ అనే వెబ్ సిరీస్‌. 1980 బ్యాక్‌డ్రాప్‌లో నాలుగు సీజన్ల సిరీస్‌గా, ముంబైలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ రూపొందనుందని తెలుస్తుంది. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటిస్తామని తేజ సర్కిల్ నుండి శనివారం ఓ ప్రకటన విడుదలైంది.

Director Teja Announces Two Bollywood Projects:

Teja lines up two Bollywood projects
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs