Advertisement
Google Ads BL

సీనియర్ నటుడు బాలయ్య ఇకలేరు


ప్రముఖ సీనియర్ నటులు బాలయ్య శనివారం ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 94 సంవత్సరాలు. హైదరాబాద్ యూసఫ్‌గూడలోని తన స్వగృహంలో బాలయ్య తుదిశ్వాస విడిచారు. నటుడిగా 300కిపైగా చిత్రాల్లో ఆయన నటించారు. ‘ఎత్తుకు పైఎత్తు’ చిత్రంతో నటుడు అయ్యారు. నిర్మాతగా, దర్శకుడిగా, కథా రచయితగా తన ప్రతిభ చూపిన ఆయన.. నిర్మాతగా అమృత ఫిల్మ్స్ సంస్థ ద్వారా ‘చెల్లెలి కాపురం’ (శోభన్ బాబు హీరో), ‘నేరము - శిక్ష’ (కృష్ణ హీరో. కె. విశ్వనాథ్ దర్శకుడు), ‘చుట్టాలున్నారు జాగ్రత్త’, ‘ఊరికిచ్చిన మాట’ (చిరంజీవి హీరో) వంటి చిత్రాలను నిర్మించారు.

Advertisement
CJ Advs

 

దర్శకుడిగా ‘పసుపు తాడు, నిజం చెబితే నేరమా, పోలీసు అల్లుడు’ వంటి చిత్రాలను రూపొందించారు. ఉత్తమ కథా రచయితగా ‘ఊరికిచ్చిన మాట’ చిత్రానికి నంది అవార్డు అందుకున్నారు. ‘చెల్లెలి కాపురం’ చిత్రానికి నిర్మాతగా నంది అవార్డు అందుకున్నారు. బాలయ్య కుమారుడు తులసీరామ్ కూడా కొన్ని చిత్రాల్లో కథానాయకుడిగా నటించారు. బాలయ్య మృతి గురించి తెలిసిన చలనచిత్ర ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.

ఆయన మన మధ్య లేకపోవడం దురదృష్టకరం -బాలకృష్ణ

సీనియర్ నటులు మన్నవ బాలయ్యగారి మరణవార్త నన్నెంతగానో కలచివేసింది. బాలయ్యగారు అద్భుతమైన నటులు. నాన్నగారితో కలిసి నటించారు. నా చిత్రాల్లో కూడా మంచి పాత్రలు పోషించారు. మంచి నటుడిగానే కాకుండ నిర్మాతగా, దర్శకుడిగా, కథా రచయితగా బాలయ్యగారు తన ప్రతిభ చూపారు. ఆయనతో మా కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. ఈ రోజు ఆయన మన మధ్య లేకపోవడం ఎంతో దురదృష్టకరం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.

-నందమూరి బాలకృష్ణ

 

నాదెండ్ల మనోహర్ సంతాపం

నటుడు బాలయ్య మృతికి జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సంతాపం తెలిపారు. బాలయ్య గారు భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.

తెలుగు దర్శకుల సంఘం సంతాపం

ప్రముఖ నటులు, దర్శకులు, అమృతాఫిలిమ్స్ అధినేత.. శ్రీ బాలయ్య గారి మరణం.. చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలనీ ఆ భగవంతుడ్ని  ప్రార్ధిస్తున్నాను. 

వై. కాశీ విశ్వనాధ్, 

(తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు)

Senior Actor Balayya is No More:

Senior Actor Balayya&nbsp;<span>Passess Away</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs