Advertisement
Google Ads BL

జబర్దస్త్‌కి కమెడియన్స్ కావలెను


జబర్దస్త్‌లో ప్రస్తుతం కమెడియన్స్ కరువయ్యారు. అటు జెడ్జెస్ కూడా సరిగ్గా ఉండడం లేదు. ఆమని, ఇంద్రజ, లైలా అంటూ కొత్తకొత్తగా కనబడుతున్నారు. రోజా రెండు వారాలుగా మిస్ అవుతూనే ఉన్నారు. మంత్రి పదవి ఖాయమవడంతో జబర్దస్త్‌ని రోజా వదిలేసినట్లే అని చెప్పుకుంటున్నారు. ఒక వారం వస్తుంటే.. ఒక వారం ఆవిడ మాయమవుతున్నారు. మరోపక్క కమెడియన్స్ లేక జబర్దస్త్ వెల వెల బోతుంది. స్కిట్స్ సరిపడా లేక డాన్సర్స్‌ని గ్రూప్‌గా ఫామ్ చేసి స్కిట్ చేపిస్తున్నారు. వాళ్ళేమో తత్త బెబ్బే అన్నట్టుగా కామెడీ చేస్తున్నారు.

Advertisement
CJ Advs

 

హైపర్ ఆది ఎంతగా పంచెస్ వేసినా ఒక్కడే ఏం చేస్తాడు. గత రెండు వారాలుగా ఆది కూడా లేడు. ఇక ఎక్సట్రా జబర్దస్త్‌లో సుధీర్ టీం, భాస్కర్ టీం కష్టపడుతుంది. అక్కడా కమెడియన్స్ లేరు. జబర్దస్త్ కమెడియన్స్ అంతా స్టార్ మాలోనే కనిపిస్తుంటే జబర్దస్త్‌లో స్కిట్స్ చేయడానికి కమెడియన్స్ కొరత ఎక్కువైంది. మరి ఈ లెక్కన కొత్తగా ఎవరికి ఛాన్స్ ఇస్తారో లేదంటే అలా సీరియల్ నటీమణులు, అలాగే డాన్స్ మాస్టర్స్‌తోనే షో ని లాగించేస్తారో చూద్దాం.

ETV Show jabardasth wants Comedians :

No Comedians in jabardasth Show
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs