Advertisement
Google Ads BL

RRR ని క్రాస్ చేసిన కెజిఎఫ్ 2


ట్రిపుల్ ఆర్ హడావిడి ముగిసినది. మరో పాన్ ఇండియా ఫిలిం కెజిఎఫ్ 2 హడావిడి అన్ని భాషల్లోనూ మొదలైపోయింది. యశ్ అండ్ కెజిఎఫ్ టీం తెలుగు, హిందీ, తమిళ, మలయాళం భాషల్లో సినిమాని విపరీతంగా ప్రమోట్ చేస్తున్నారు. కెజిఎఫ్ పై ఉన్న హైప్ ఇక్కడ చాప్టర్ 2 కి బాగా పని చేస్తుంది. కెజిఎఫ్ 2 లో హీరో ఏం చెయ్యబోతున్నాడో అనే కుతూహలంతో యశ్ ఫాన్స్ మాత్రమే కాదు మాస్ ఆడియన్స్, సాధారణ ప్రేక్షకులు వెయిట్ చేసేలా సీక్వెల్ ని సెట్ చేసారు ప్రశాంత్ నీల్. ఇక యాక్షన్ ఫిలిమ్స్ కి హిందీలో బోలెడంత క్రేజ్ ఉంటుంది. అందుకే కెజిఎఫ్ 2 అక్కడ నార్త్ లో 3000+ స్క్రీన్స్ లో రిలీజ్ కాబోతుంది. అయితే హిందీలో తాజాగా కెజిఎఫ్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. గురువారం అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ కాగా.. కెజిఎఫ్ 2 మొదటిరోజు RRR అడ్వాన్స్ బుకింగ్ లను క్రాస్ చేసినట్లు తెలుస్తోంది. 

Advertisement
CJ Advs

మల్టీప్లెక్స్‌లలో గురువారం ఉదయం ఓపెన్ అయిన బుకింగ్స్ చాలా తక్కువ సమయంలోనే RRR ని క్రాస్ చేసింది అంటున్నారు. టికెట్ ప్రైస్ ఎక్కువగా ఉన్నప్పటికీ కేజిఫ్ 2 టికెట్స్ హాట్ కేక్ లా అమ్ముడవుతున్నాయని, సింగిల్ స్క్రీన్‌లలో అడ్వాన్స్ బుకింగ్స్ వారాంతంలో లేదా సోమవారం ఓపెన్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఫస్ట్ డే హిందీలో కెజిఎఫ్ కి రికార్డ్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు. అయితే అదే రోజు అక్కడ మరో మూవీ జెర్సీ కూడా రిలీజ్ కాబోతుంది. హిందీలో జెర్సీ vs కెజిఎఫ్ అన్నట్టుగా ఉంది వ్యవహారం.

KGF2 Advance Crosses RRR In No Time:

KGF 2 vs RRR: From a whopping day 1 collection
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs