Advertisement
Google Ads BL

కెజిఎఫ్ 2 హిందీలో ఆ రేంజ్ రిలీజా


కెజిఎఫ్ 2 ఇప్పుడు బాహుబలి రికార్డులని తొక్కెయ్యాలనే టార్గెట్ గా బరిలోకి దిగుతున్న మాస్ మూవీ. ఏప్రిల్ 14 న వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో పాన్ ఇండియా మూవీ గా రాబోతున్న కెజిఎఫ్ 2 పై అంచనాలు ఎలా ఉన్నాయో గత కొన్ని రోజులుగా ఆ సినిమా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ చేసే రచ్చ చూస్తే తెలుస్తుంది. మాస్ కటౌట్ యశ్ ఈసారి ఎన్ని సంచనాలు పుట్టిస్తారు, హీరోయిజాన్ని హైలెట్ చేస్తూ మేకింగ్ లో తనదైన స్టయిల్లో మాస్ ఆడియన్స్ కి పూనకాలు తెప్పించిన ప్రశాంత్ నీల్ ఈసారి ఎలాంటి మ్యాజిక్ చేస్తారో అనే క్యూరియాసిటీతో ఫాన్స్ ఉన్నారు. 

Advertisement
CJ Advs

అయితే ఈ సినిమాకి తెలుగులో పోటీ లేకపోయినా.. తమిళ్ బీస్ట్, హిందీలో జెర్సీ మూవీ గట్టి పోటీ ఇవ్వడానికి రెడీ అయ్యాయి. తమిళ్ లో విజయ్ హీరోయిజం తెలియంది కాదు, బాలీవుడ్ లోనూ కబీర్ సింగ్ తో షాహిద్ కపూర్ ట్రెండ్ సెట్ చేసారు. సో ఆ రెండు భాషల్లో కెజిఎఫ్ 2 కి గట్టి పోటీనే. అయితే కెజిఎఫ్ 2 కి బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, రవీనా టాండన్ హెల్ప్ అయ్యేలా కనిపిస్తున్నారు. ఇక కేజిఎఫ్ 2 తమిళంలో 250 థియేటర్స్ లో రిలీజ్ అవుతుంటే.. హిందీలో అంటే నార్త్ ఇండియా లో రికార్డ్ స్థాయిలో 3,000+ స్క్రీన్స్ లో రిలీజ్ అవుతుండడంతో ఆ సినిమా క్రేజ్ నార్త్ లో ఎంతగా ఏ రేంజ్ లో ఉందొ పూర్తిగా అర్ధమవుతుంది. మొదటి రోజు నార్త్ లో ఈ రేంజ్ లో రిలీజ్ అయితే బాహుబలి రికార్డులను కెజిఎఫ్ 2 తిరగరాసినా రాసుద్ది అంటున్నారు విశ్లేషకులు. 

Record Release in KGF 2 Hindi:

KGF 2 release on record at 3,000+ screens in North India
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs