మెగా హీరో వరుణ్ తేజ నటించిన గని మూవీ వాయిదాల మీద వాయిదాలతో ఎట్టకేలకు ఆడియన్స్ ముందుకు వచ్చింది. వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించిన ఈ సినిమాకి కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయమయ్యారు. గీత ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు బాబీ నిర్మించిన ఈ చిత్రంలో ఉపేంద్ర, సునీల్ శెట్టి లాంటి కీలక నటులు నటించడంతో సినిమాపై మంచి అంచనాలే వచ్చేసాయి. మరి నేడు వరల్డ్ వైడ్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన గని మూవీ టాక్ ఎలా ఉందొ యుఎస్ ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ స్పందన ఎలా ఉందో తెలుసుకుందాం.
గని మూవీ ని ఎర్లీ ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్.. బాక్సర్‌గా వరుణ్ తేజ్ పవర్‌ఫుల్ ఎంట్రీ ఇచ్చారని, వరుణ్ తేజ్ పెరఫార్మెన్స్ తోనూ, డైలాగ్స్ తోనూ, ఫిజిక్ తోనూ అదరగొట్టేసాడు అంటున్నారు. అలాగే సినిమాలో ఫస్టాఫ్ అంతా లవ్ స్టోరీతో నింపేశారని, ఫస్ట్ హాఫ్ యావరేజ్‌గా ఉందని అంటున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్‌లో ఉపేంద్ర ఎంట్రీతో సినిమా ట్విస్ట్ రివీల్ అయ్యింది అంటున్నారు. బాక్సింగ్ సీన్స్ అద్భుతంగా వచ్చాయని, తమన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ అయ్యాయని టాక్. అలాగే సినిమాలో మెయిన్ మైనస్ ల్లో రొటీన్ కథ, నెమ్మదించిన స్క్రీన్‌ప్లే, కామెడీ పేలకపోవడం, పాత కథకు కొత్త రంగులు అద్దినట్టుగా ఉంది అని.. కొత్తదనం లేకపోవడం మైనస్‌లుగా మారాయని గని ని చూసిన ఆడియన్స్ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు.