ప్రభాస్ ఫాన్స్ ప్రస్తుతం రాధే శ్యామ్ ప్లాప్ మూడ్ లో డల్ అయ్యారు. ఎన్నో అంచనాలు పెట్టుకున్న రాధే శ్యామ్ కి వచ్చిన డివైడ్ టాక్ తో చాలా డిస్పాయింట్ అయ్యారు వారు. అయితే ఇప్పుడు ఆయన తదుపరి డైరెక్టర్స్ ప్రభాస్ ఫాన్స్ కి వరసగా గుడ్ న్యూస్ చెబుతూనే ఉన్నారు. అందులో రీసెంట్ గా ఓం రౌత్ ప్రభాస్ ఆదిపురుష్ కోసం వి షేప్ లోకి మారారని, ఆ లుక్ కోసం ప్రభాస్ చాలా కష్టపడ్డారు అంటూ చెప్పారు. ప్రభాస్ మాత్రమే రాముడి గెటప్ కి పర్ఫెక్ట్ అని ఆయన చెప్పారు. తాజాగా సలార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ 2 ప్రమోషన్స్ లో సలార్ పై అప్ డేట్ ఇచ్చారు.
అది సలార్ మూవీ ఇప్పటికే 30 శాతం షూటింగ్ పూర్తయ్యింది అంటూ ఆయన కెజిఎఫ్ 2 చెన్నై ఈవెంట్ లో చెప్పడంతో ప్రభాస్ ఫాన్స్ హ్యాపీ గా ఫీలవుతున్నారు. మే చివరి వారం నుండి సలార్ తదుపరి షెడ్యూల్ ఉండొచ్చు అని తెలుస్తుంది. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. మరో క్రేజీ మలయాళ నటుడు పృద్వి రాజ్ సుకుమారన్ సలార్ లో భాగమవడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోతున్నాయి.