Advertisement
Google Ads BL

హిందీ సినిమాల పై మహేష్ పంచ్


సూపర్ స్టార్ మహేష్ బాబు పైకి మాత్రం చాలా సైలెంట్ గా తనపని తాను చేసుకుపోతూ ఫ్యామిలీకి ఎక్కువ విలువ నిచ్చే హీరోగానే కనిపిస్తారు తప్ప.. మహేష్ బాబు లో ఫన్నీ యాంగిల్ ఉంది అనేది ఏ కొద్ది మందికి మాత్రమే తెలిసుంటుంది. మహేష్ బాబు స్పాంటినియస్ పంచ్ ల విషయం సమంత- త్రివిక్రమ్ తో మహేష్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు, ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షో, అలాగే బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోస్ అప్పుడే చాలామందికి తెలిసింది. 

Advertisement
CJ Advs

అయితే రీసెంట్ గా మహేష్ బాబు ఓ యాప్ లంచ్ లో పాల్గొన్నారు. అక్కడ ఓ జర్నలిస్ట్ మీరు హిందీలో డైరెక్ట్ సినిమా ఎపుడు చేస్తున్నారు అని అడగగానే మహేష్ బాబు ఖతర్నాక్ ఆన్సర్ ఇచ్చారు. ఇప్పుడు డైరెక్ట్ హిందీ సినిమా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెలుగులో చేసిన సినిమాలే హిందీతో పాటు ఇండియా మొత్తం అద్భుతమైన ఆదరణ లభిస్తుంది. అంటూ హిందీ సినిమాలే చెయ్యక్కర్లేదు పాన్ ఇండియా మూవీస్ చేస్తే చాలు అన్నట్టుగా మహేష్ ఆన్సర్ ఇచ్చారు. అలాగే రాజమౌళితో తన తదుపరి సినిమా పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్నట్టుగా చెప్పారు. 

Mahesh Babu believes he need not act in Hindi movies:

Mahesh Babu answer about his Hindi film debut
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs