Advertisement
Google Ads BL

బిగ్ బాస్ 4: అభిజిత్-హారిక సీక్రెట్ పార్టీ


బిగ్ బాస్ సీజన్ విన్నర్ అలాగే టాప్ 5 వరకు వచ్చి పోరాడిన దేత్తడి హారిక బిగ్ బాస్ హౌస్ లో ఫ్రెండ్లీ గా కాదు.. చాలా క్లోజ్ గా హగ్స్  ఇచ్చుకుంటూ వారి మధ్యన సం థింగ్ సం థింగ్ అన్నట్టుగా ఉండేవారు. మోనాల్ ని అవాయిడ్ చేస్తూ అభిజిత్ ఆల్మోస్ట్ హారిక కి దగ్గరయ్యాడు. అయితే హౌస్ లో అంత క్లోజ్ గా ఉన్న ఆ జంట బయటికొచ్చాక ప్రేమ విషయం చెబుతుందని, పెళ్లి చేసుకుంటారేమో అనుకుంటే అభిజిత్ మాత్రం అందరికి షాకిస్తూ హారిక తనకి సిస్టర్ లాంటిది అంటూ ఛానల్స్ లో కూర్చుని మరీ షాకిచ్చాడు. తర్వాత హారిక షార్ట్ ఫిలిమ్స్ తో, ఇంటర్వూస్ తో, ఫ్యాషన్ షోస్ తో కాస్త బిజీగా మారిపోయింది. అభిజిత్ మాత్రం ఖాళీగానే ఉన్నాడు. కొన్నాళ్ళకి ఈ జంట గురించి అందరూ మర్చిపోయారు.

Advertisement
CJ Advs

అదే అఖిల్ - మోనాల్ హౌస్ నుండి బయటిలోకి వచ్చాక కూడా జంటగా చేసిన హడావిడికి ఇప్పటికీ వారు మీడియాలో హైలెట్ అవుతూనే ఉన్నారు. కానీ అభిజిత్ - హరిక తర్వాత కలిసి  ఉన్న సందర్భం కానీ, ఓ ఫోటో కానీ బయటికి రాలేదు. అయితే తాజాగా అభిజిత్ - హారిక చాలాకాలం తర్వాత కలవడమే కాదు.. వీళ్లతో పాటు ఆ సీజన్ కంటెస్టెంట్, ప్రముఖ సింగర్ నోయల్ కలిసి ఓ పార్టీ చేసుకున్నారు. నోయల్ తో అభిజిత్ - హరిక కలిసి పార్టీ చేసుకున్నా.. అక్కడ అభిజిత్ - హరికనే హైలెట్ అవుతున్నారు. వీరి ముగ్గురు పార్టీ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అభిజిత్ - హారిక సీక్రెట్ పార్టీ అంటూ అప్పుడే న్యూస్ లు మొదలైపోయాయి కూడా. ఏది ఏమైనా హారిక ఫాన్స్ - అభిజిత్ ఫాన్స్ మాత్రం ఫుల్ ఖుష్ అవుతున్నారు వీరి కలయికతో.

Bigg Boss: Abhijeet - Harika Secret Party:

Bigg Boss 4 title winner Abhijeet Met Harika Noel after long time
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs