అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ లో అద్భుతమైం హిట్ కొట్టడమే కాదు.. ఇండియాలోనే నెంబర్ వన్ మార్కెట్ అయిన హిందీలో 100 కోట్ల వసూళ్లు సాధించడంతో అల్లు అర్జున్ క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. దానితో పుష్ప పార్ట్ టు పై అన్న భాషల ఆడియన్స్ లోను ఆసక్తి, క్రేజ్ పెరిగిపోతుంది. పుష్ప రాజ్ గా కొత్త గెటప్ లో అల్లు అర్జున్ ట్రెండ్ సెట్ చేసారు. క్రికెటర్స్ మాత్రమే కాదు.. రీసెంట్ గా ఓ విద్యార్థి తన ఎగ్జామ్ పేపర్ లో తగ్గదే లే డైలాగ్స్ కి పేరడీగా రాసేదే లే అని రాసాడంటే.. పుష్ప తగ్గేదే లే తో అల్లు అర్జున్ ఎలాంటి ట్రెండ్ సెట్ చేసారో అర్ధమవుతుంది. పుష్ప ద రూల్ షూటింగ్ మొదలు కావడానికి కొద్దిగా సమయం పడుతుంది అంటున్నారు.
ఇలాంటి టైం లో రేపు రాబోతున్న అల్లు అర్జున్ బర్త్ డే రోజున ఫాన్స్ డిస్పాయింట్ అవ్వాల్సిందే అనుకున్నారు. కానీ అల్లు అర్జున్ బర్త్ డే రోజున పుష్ప ద రూల్ నుండి ఆలు అర్జున్ కి స్పెషల్ పోస్టర్ తో టీం విషెస్ చెప్పబోతున్నట్లుగా తెలుస్తుంది. సుకుమార్ అల్లు అర్జున్ బర్త్ డే కి ఎలాంటి ట్రీట్ ని ఫాన్స్ కి ఇవ్వబోతున్నారో అల్లు అర్జున్ ఫాన్స్ ఇప్పటినుండే ఆత్రంతో సోషల్ మీడియాలో రచ్చ స్టార్ట్ చేసేసారు. ఇక అల్లు అర్జున్ కొత్త సినిమాల అనౌన్సమెంట్స్ పై కూడా ఫాన్స్, ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చూద్దాం రేపు అల్లు కాంపౌండ్ నుండి రాబోయే అప్ డేట్స్ ఏమిటి అనేది.